ఇలాంటి ఉద్యోగాలు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..

Satvika
కోటి విద్యలు కూటి కొరకే .. అన్న సామెత అందరికీ తెలిసిందే.. ఎన్ని గారడీలు చేసిన సాయంత్రం బొజ్జ నింపుకొనెలా ఉండాలి.. అయితే తింటే సాలరీలు ఇస్తాము అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవును మీరు విన్నది నిజమే.. ఓ ప్రముఖ క్యాండీ కంపెనీ క్యాండీలను తిని వాటి రుచి గురించి చేపాలని తన ఎంప్లాయీస్ కు చెప్పింది. ఆ కంపెనీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 



వివరాల్లోకి వెళితే.. విదేశీ క్యాండీలు కూడా ఉంటున్నాయి. ఒక్కో క్యాండీది ఒక్కో కథ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో క్యాండీని ఇష్టపడుతుంటారు. క్యాండీలు తినేందుకు విదేశాల్లో పోటీలు కూడా పెడుతుంటారు. అంతగా క్యాండీలకు ప్రాచుర్యం ఉంటుంది. అందుకేనేమో.. క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావాలంటూ కెనడాకు చెందిన ఒక క్యాండీ తయారీ కంపెనీ ప్రకటన జారీచేసింది.అంటారియోలోని మిస్సిసాగాలో ఉన్న క్యాండీ తయారీ కంపెనీ క్యాండీ ఫన్‌హౌస్ తమ క్యాండీలను రుచి చూసి ఏవిధంగా ఉన్నాయో సమీక్ష జరిపి చెప్పేందుకు ఉద్యోగులు అవసరమని సంస్థ వెబ్‌సైట్‌ candyfunhouse.ca లో కెరీర్స్‌లో ప్రకటన ఇచ్చింది. 



ఇందులో పని చేసే వాళ్ళు రోజు ఆ కంపెనీ తయారు చేసే క్యాండీలు తిని రుచిని షేర్ చేసుకోవాలని తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ 3000 రకాలకు పైగా క్యాండీ లను తయారు చేస్తుంది.త్వరలో మరో పది రకాల క్యాండీలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం అసలైన క్యాండీలను ఎన్నుకోవడంలో సహాయపడటానికి బలమైన దంతాలు కలిగివున్న పార్ట్‌టైమ్ ఫుల్‌టైమ్‌ అభ్యర్థులు అవసరమని పేర్కొంటున్నది..ఈ ఉద్యోగాలకు కేవలం కెనడా, అమెరికా వాళ్ళు అయ్యి ఉండాలి. అంతేకాదు వయస్సు పరిమితి కూడా ఉంది. 18 సంవత్సరాల వయసు వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఉద్యోగంలో చేరే వారికి గంటకు 30 డాలర్ల పారితోషికాన్ని ఇవ్వనున్నారు. అయితే, కేవలం పది మందిని మాత్రమే ఎంపిక చేసుకోవాలని కంపెనీ నిర్ణయించింది.ఫిబ్రవరి 15 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: