హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్..!

Satvika
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో జనాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోన్స్ కోసం బ్యాంక్స్ చుట్టూ తిరుగుతున్నారు. తీసుకున్న లోన్లు చెల్లించడానికి మరి కొందరు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదని ప్రముఖ వాణిజ్య బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ అదిరిపోయే వార్తను అందించింది..హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్ ను చెప్పింది.. కస్టమర్ల ఆర్ధిక పరిస్థితి బాగొలేని కారణంగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.గతంలో ఎస్బిఐ అందించిన సదుపాయాన్ని అందిస్తుందని తెలుస్తుంది.ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ల కోసం ఈఎంఐ చెల్లింపులను మరింత సులభతరం చేసింది. వివరాలని చూస్తే.. కొత్త సేవలు తీసుకు రావడం తో కస్టమర్లకు ఊరట లభించనుంది. 



ముఖ్యంగా లోన్ తీసుకున్న వాళ్లకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. సీఎస్‌సీ ఇగవర్నెన్స్ సర్వీసెస్‌తో పార్ట్నర్ షిప్కుదుర్చుకున్నట్లు తెలిపింది. దీనితో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈఎంఐ కలెక్షన్ సేవలను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ సర్వీసులు గురించి చూస్తే.. ఇవి దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలియజేయడం జరిగింది..అయితే వారి ఓవర్‌డ్యూ అమౌంట్‌ను సులభంగానే చెల్లించొచ్చు..బకాయిలు చెల్లించడానికి కష్టమర్లు వారు దగ్గరిలోని సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి చెల్లించవచ్చినని అంటున్నారు. 



ఇలాంటి బిల్ మెంట్స్ చేయడానికి ఎక్కడకు వెళ్లాల్సిన పని లేదు..ముఖ్యంగా బ్యాంక్ కు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.రెగ్యులర్ ఈఎంఐలతో పాటు ఈఎంఐ మిస్ అయినా చార్జీలతో కలిసి ఈఎంఐ చెల్లించడానికి బ్యాంక్ కి వెళ్ళక్కర్లేదు. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పే చేసేయొచ్చు. వెహికల్ లోన్, టూవీలర్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ లకు సంబంధించిన అన్ని లోన్స్ ను సీఎస్‌సీ సెంటర్ల లో చెల్లించొచ్చు. .. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు కొంతవరకూ ఊరట కలుగుతుందని అంటున్నారు. ఈ విధానం ద్వారా సగం పని తీరుతుందని చెప్పుకొచ్చారు. ఈ విధానం ద్వారా టైమ్ సేవ్ అవుతుందని కస్టమర్లు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: