ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్..!!

Satvika
ఎస్బీఐ వినియోగ దారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇప్పటికే పలు ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాదు తక్కువ వడ్డీకి రుణాలను కూడా అందించింది. కస్టమర్లకు సంబంధించి ఎటువంటి కష్టాలను రానివ్వకుండా ఎన్నో ప్రయోజనాలను అందించింది. ఇప్పుడు మరో కొత్త ఆఫర్ ను అందిస్తున్నట్లు తెలుస్తుంది.ఎస్‌బీఐ తన కస్టమర్లకు కొత్త సేవలు అందిస్తోంది. దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ కస్టమర్లకి తమ ఇంటికే డబ్బులని పంపిస్తుంది. ఇలా మీరు బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటికి డబ్బులు పొందవచ్చు. అయితే మరి ఈ సర్వీస్ ఎలా పని చేస్తుంది. 


ఏ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..అసలు విషయానికొస్తే.. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు కేవలం 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి మాత్రమేనాని ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ సర్వీసును పొందాలంటే ఎస్బిఐ కస్టమర్లూ వారి బ్యాంక్ కు సంబంధించిన కేవైసిని పూర్తి చేసి ఉండాలి. అలానే బ్యాంక్ అకౌంట్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి గమనించండి. ఈ నిబంధలను కనుక అనుసరిస్తే ఈ డోర్‌ స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఈజీగా పొందొచ్చు..


ఇది ఇలా ఉండగా గతంలో ఈ బ్యాంక్ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన డోర్‌ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. .1000 నుంచి రూ.20 వేల వరకు డబ్బులను ఇంటి వద్దనే పొందొచ్చు గమనించండి. కస్టమర్లు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి డోర్ స్టెప్ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇంటి వద్దనే డబ్బులని తీసుకోవచ్చు. వాటే ఆఫర్ కదా..? ఒకవేళ బ్యాంక్‌కు వెళ్లకుండానే డబ్బులు పొందాలని అనుకుంటే ఎస్బిఐ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయవచ్చు. వరుస ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న ఎస్బిఐ వల్ల ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల ప్రజలు డిజిటల్ లావాదేవీలను మాత్రమే చేస్తున్నారు. అలా చేస్తున్న వారికి ఈ పద్దతి చాలా బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: