ఎస్బీఐ వినియోగదారులకు షాక్.. అలాంటి ఖాతాలకు జరిమానా..!
అంటే ఇకనుంచి ఎస్బీఐ ఏటీఎంలలో డబ్బు తీసే ముందు ఖాతాలో డబ్బు ఎంతుందో చెక్ చేసుకోవాలి. లేదంటే విత్ డ్రా చేశాక ఖాతాలో సరిపడా డబ్బులేకపోతే కచ్చితంగా జరిమానా పడుతుంది. ఈ మేరకు ఎస్బీఈఐ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇటీవల ఆ నిబంధనలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.
తాజా రూల్స్ ప్రకారం.. ఖాతాదారుల అకౌంట్ లో సరిపడా డబ్బు లేకపోయినా, ఒకవేళ డబ్బు లేకపోవడంతో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా.. ప్రతీసారి రూ.20+జీఎస్టీ చొప్పున ఫైన్ పడనుంది. అంతేకాదు పరిమితికి మించి డబ్బు విత్‌డ్రా చేయడం, అంటే మినిమం బ్యాలెన్స్ లేకుండా ఎక్కువ సొమ్మును ఖాతా నుంచి విత్ డ్రా చేయడం వల్ల కూడా ఇదే స్థాయిలో ఫైన్ పడనుంది. అందువల్ల ఇకనుంచి ఎస్బీఐ ఖాతాదారులంతా ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని మీమీ ఖాతాల్లో నగదు ట్రాన్సాక్షన్ చేయండి. లేకుంటే మీరూ ఈ జారిమానాకు బలి కాక తప్పదు.
ఇదిలా ఉంటే ఈ నిబంధనలను అనేకమంది ఖాతాదారులకు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్బీఐ కూడా ఇలా ప్రైవేటు బ్యాంకుల్లా జరిమానాలు వసూలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేని ఖాతాల సంఖ్యను తగ్గించేందుకు ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చామని, ఖాతాదారులు ఆ విషయాన్ని గమనించి సహకరించాలని ఎస్బీఐ కోరుతోంది.