కోటక్ మహీంద్రా బ్యాంక్ అదిరిపోయే న్యూస్ ..!
విషయానికొస్తే.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి)పై వడ్డీ రేట్లను సవరించింది. ఈ కొత్త ఎఫ్డీ రేట్లు ఈ ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వస్తాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. వేర్వేరు డిపాజిట్ కాలపరిమితిపై 2.50% నుండి 5.25% వరకు వడ్డీని అందిస్తుంది. రూ. 2 కోట్ల వరకు కనిష్టంగా 7 రోజుల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు ఎఫ్డీలను ఆఫర్ చేస్తుంది. 7 నుండి 30 రోజులు, 31 నుండి 90 రోజులు, 91 నుండి 179 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఎఫ్డిలపై వరుసగా 2.5%, 2.75%, 3.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఇక 180 రోజుల నుండి ఏడాది వరకు మెచ్యూరిటీ కలిగిన టర్మ్ డిపాజిట్లపై 4.40% వడ్డీని చెల్లిస్తుంది..
ఏడాది నుండి 389 రోజుల వరకు 4.50%, 391 రోజుల నుండి రెండేళ్ల కన్నా తక్కువ మెచ్యూరిటీ గల ఎఫ్డిలపై 4.75% చెల్లిస్తుంది. ఇక రెండేళ్ల నుంచి 5శాతం వడ్డీకే రుణాలను మంజూరు చేస్తూ వస్తుంది. మూడేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు 5.10% చెల్లిస్తుంది. నాలుగేళ్లు నుంచి ఐదేళ్ల వరకు చేసే ఎఫ్డీలపై 5.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఐదేళ్ల నుండి పదేళ్ల వరకు5.25% వడ్డీ అందిస్తుంది.. సీనియర్స్ కు సంబందించిన బెస్ట్ బేసిస్ పాయింట్లు కూడా అందించింది. అంతేకాదు వారికి వడ్డీలను కూడా అనుకున్న విధంగా అందించింది. దాదాపు 3 నుంచి 5.75 శాతం అందించింది. ఇలాంటి ఆఫర్లను ఇవ్వడంతో బ్యాంక్ డిపాజిట్లు కూడా పెరుగుతున్నాయని తెలుస్తుంది.