ఈ బైక్ ఒకసారి ఛార్జింగ్ పెడితే చాలు 240 కి.మీ ప్రయాణిస్తుందంట మరి.. !!

Suma Kallamadi
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బైక్ గాని స్కూటీ గాని లేనిదే బయటకి రావడం లేదు.ఎందుకంటే బైక్ ఉంటే ప్రయాణం సులభతరం అవుతుంది కాబట్టి.  అలాగే ఒక పక్క పెట్రోల్ ధర కూడా రాను రాను ఎక్కువ అవ్వడంతో ప్రజలు బయపడి పోతున్నారు. ఈ క్రమంలోనే  ఓలా కంపెనీ ఇప్పుడు ఒక ఎలెక్ట్రిక్ బైక్ ని అందుబాటులో తీసుకువచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏకంగా 500 ఎకరాల స్థలంలో మెగా ఫ్యాక్టరీని తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరిలో నిర్మిస్తున్నారు. ఈ కొత్త ఫ్యాక్టరీ భారతదేశంలోని డిమాండ్‌ను తీర్చడమే గాక "ఓలా ఎలక్ట్రిక్" ఎగుమతి కేంద్రంగా కూడా పనిచేస్తుంది.



 దాదాపు ఒక కోటి వాహనాలను ఏడాది కాలంలో తయారు చేయగల సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓలా కంపెనీ తయారుచేయబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలను వెల్లడించింది.ఓలా గత ఏడాది మేలో నేదర్లాండ్ ఆమ్‌స్టర్ డామ్‌ ఆధారిత ఈవీ బ్రాండ్ ఏటిర్గోను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో భారత దేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏటిర్గో యాప్ స్కూటర్ మొట్టమొదట 2018లో తయారైంది. ఇది సింగిల్ ఛార్జింగ్ తో 240 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలుపుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో 0-45 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.



ఓలా ప్రస్తుతం భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఉన్న ఈథర్ 450 ఎక్స్, బజాజ్ చేతక్, టివిఎస్ ఐక్యూబ్ వంటి స్కూటర్లకు ఈ రాబోయే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇవన్నీ రూ.1.30లక్షల నుంచి రూ.2 లక్షల ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్‌ను రూ.1.25లక్షలకు తీసుకురావాలని భావిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను కనుక ఇదే ధరకు అందుబాటులోకి తీసుకొస్తే ప్రపంచంలోనే ఓలా ఒక సంచలన సృష్టిస్తుంది అని చెప్పవచ్చు.. !


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: