నెలకు కేవలం 500 కడితే చాలు.. బంగారాన్ని కొనుక్కోవచ్చు..
ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి నెల నెలా మంత్లీ స్కీమ్ పేరుతో చాలా మంది కడుతున్నారు. నగల దుకాణాల యాజమాన్యాలు ఇలాంటి స్కీంలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.వీటిలో చాలా వరకూ ఒక సంవత్సరం నిడివి కలవి ఉన్నాయి. మంత్లీ చిట్ తరహాలోనే ఇందులో బంగారం కొనుగోలు చేయవచ్చు.ప్రస్తుతం మార్కెట్లోని ప్రముఖ జువెలరరీ దుకాణాలు అదిరిపోయే స్కీమ్స్ తో ముందకు వచ్చాయి. వీటిల్లో నెల నెల కొంత సొమ్మును ఈఎంఐ తరహాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తూ పోతే చివరకు మీరు కట్టిన డబ్బుకు బదులుగా బంగారపు వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలాగే బంగారం తగ్గింపు ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది.
జీఆర్టీ గోల్డ్ సైతం గోల్డెన్ లెవెన్ ఫ్లెక్సీ ప్లాన్ పేరిట ఒక కొత్త స్కీం ప్రారంభించింది. ఈ స్కీమ్ ప్రకారం నెలకు జస్ట్ రూ.500 కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో చేరిన వారు 11 నెలలు డబ్బులు కడితే ఒక నెల డబ్బులు కంపెనీ అదనంగా మీకు చెల్లిస్తుంది. అంటే 12 నెలల డబ్బులతో బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. జోస్ అలుక్కాస్ ఆన్లైన్ ప్లాట్ ఫాం ద్వారా ఈజీ బై పేరిట మరో కొత్త స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌లో అయితే కనిష్టంగా రూ.1,000 నుంచి ఎంతైనా కట్టుకోవచ్చు.. ఇలా స్కీమ్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా డబ్బులు కట్టుకొని ఏదైనా వస్తువును కొనుక్కోవడం చాలా మంచి ఆలోచన..