కస్టమర్ల కోసం ఎల్ఐసీ అదిరిపోయే ఆఫర్..

Satvika
ప్రముఖ వాణిజ్య బ్యాంకులు ఖాతాదారుల కు అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా దీన స్థితి లో కి వెళ్ళిన వారికి ఆసరాగా నిలుస్తున్నారు. ఎస్బిఐ వంటి ప్రముఖ బ్యాంకులు కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాల ను అందిస్తున్నారు. ఇప్పుడు ఎల్ఐసీ కూడా పాలసీ దారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.ఎక్కువ మంది ఉద్యోగులు సొంత ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కస్టమర్ల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీతో హోమ్ లోన్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ సంస్థలు తక్కువ వడ్డీతో హోమ్ లోన్లను అందిస్తున్నాయి.


తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తమ కస్టమర్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.ఏకంగా ఆరు నెలలకు సమానమైన హోమ్ లోన్ ఈఏంఐ లను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. హోమ్ లోన్ ప్రొడక్ట్ ను ఎంచుకున్న వారికి ఈ ఆఫర్ వారికి వర్తిస్తుంది. డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్‌ ప్రకారం పెన్షన్‌ కు అర్హత ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్‌యూ, బ్యాంకు, డిఫెన్స్ ఇతర ఉద్యోగులు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులని ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. గృహ వరిష్టకు దరఖాస్తు చేసుకునే వారికి 65 సంవత్సరాల వరకు వయసు ఉండవచ్చు.


కస్టమర్లకు 80 సంవత్సరాలు వచ్చే వరకు లేదా లోన్ గడువు అత్యధికంగా 30 సంవత్సరాల వరకు రెండిట్లో ఏది వస్తే అందిస్తున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం జులై నెల లో ప్రారంభించారు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇప్పటి వరకు 15,000 హోమ్ లోన్లను అందించింది. వీటి విలువ రూ.3,000 కోట్ల వరకు ఉంటుంది. సిబిల్ స్కోరు 700, అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాదారులకు 6.9 శాతం ప్రారంభ వడ్డీతో రూ.15 కోట్ల వరకు హోమ్ లోన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: