కారు కోనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏకంగా లక్ష తగ్గింపు..

Satvika
కారు కొనాలని భావిస్తున్నారా.. అయితే ఇప్పుడు మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. లక్ష వరకు తగ్గింపు ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు కార్ల పై ఆఫర్లను అందిస్తున్నారు. అది కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయట.. ఇక వివరాల్లోకి వెళితే..ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా కస్టమర్ల కోసం భారీ తగ్గింపు అందిస్తోంది. ఏప్రిల్ నెలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీంతో కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి..


రెనో కార్లపై ఏకంగా రూ.75 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. రెనో క్విడ్ కారుపై రూ.50 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ బెనిఫిట్ కింద రూ.20 వేల వరకు, లాయల్టీ బోనస్ కింద రూ.10 వేల వరకు, క్యాష్ బెనిఫిట్ కింద రూ.20 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.10 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు..రెనో ట్రైబర్ కారుపై కూడా రూ.55 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ కారుపై రూ.20 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్ కింద రూ.10 వేల వరకు, క్యాష్ బెనిఫిట్ కింద రూ.25 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.10 వేల వరకు బెనిఫిట్ లభిస్తోంది.


వీటిపై వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది.రూ.6.99 శాతం రేటుకే వడ్డీ ఉంటుంది.ఈ కారు ఫీచర్స్ విషయానికొస్తే..రెనో డస్టర్ 1.5 లీటరు కారుపై రూ.75 వేల వరకు తగ్గింపు ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.30 వేల వరకు, లాయల్టీ బోనస్ కింద రూ.15 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.30 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. వీటితో పాటుగా రెనో డస్టర్ 1.3 లీటర్ కారుపై రూ.30 వేల వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్, రూ.15 వేల వరకు లాయల్టీ బెనిఫిట్, రూ.30 వేల వరకు క్యాష్ బెనిఫిట్, 30 వేల వరకు కార్పొరేట్ కింద ఆఫర్ లభిస్తుంది. కారు కొనాలని భావించే వారికి ఇది చక్కటి అవకాశం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: