క్రెడిట్ కార్డు వినియోగదారులకు కళ్ళు చెదిరే గుడ్ న్యూస్..!

Satvika
క్రెడిట్ కార్డుల వాడటం ఈ మధ్య ఎక్కువగా ఉంది.. ఎవరు చూసినా కూడా వీటిని తీసుకోవడం మొదలు పెట్టారు..దీంతో క్రెడిట్ కార్డులను ఇస్తున్న బ్యాంకులు కూడా సరికొత్త ఆఫర్లను అందిస్తు ఆకట్టుకుంటున్నారు.. అయితే ఈ క్రెడిట్ కార్డుల సేవలను ముందుగా ఉపయోగించుకొని తర్వాత డబ్బులు కట్టే విధానం కావడం వల్ల ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులను వాడేందుకు ఇష్ట పడుతున్నారు.. ఇదే అదునుగా బ్యాంకులు వడ్డీలకు కూడా అధికంగా వేస్తున్నారు.


ఇది ఇలా ఉండగా క్రెడిట్ కార్డు బిల్ పే చెయ్యడం పెద్ద తల నొప్పిగా మారింది.నెల కరెక్ట్ గా బిల్ కట్టక పోతే అధిక చార్జీలను వసూలు చేస్తున్నారు.. దీంతో భయపడి పోతున్నారు. అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డు బిల్లును క్రెడిట్ కార్డుతోనే చెల్లించొచ్చు.సాధారణంగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి పేమెంట్ ఆప్షన్లలో క్రెడిట్ కార్డు ఆప్షన్ ఉండదు. అయితే పేటీఎం ఫీచర్ కారణంగా మీరు క్రెడిట్ కార్డు ద్వారా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే అవకాశం లభిస్తోంది. దీని కోసం మీరు పేటీఎం వాలెట్‌కు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు యాడ్ చేసుకోవాలి.


క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం వాలెట్‌లోకి డబ్బులు పంపించుకుంటే 2 నుంచి 3 శాతం వరకు చార్జీలు చెల్లించుకోవాలి. తర్వాత వాలెట్ నుంచి క్రెడిట్ కార్డు బిల్లు కట్టేసుకోవాలి. దీని కోసం మీరు ఆల్‌ సర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్లి మంత్లీ బిల్స్‌పై క్లిక్ చేసి క్రెడిట్ కార్డు బిల్లు ఆప్షన్ ఎంచుకోవాలి.పేటీఎం వాలెట్ నుంచి బిల్లు చెల్లించాలి. ఎలాంటి చార్జీలు పడవు. మొబిక్విక్ ద్వారా కూడా క్రెడిట్ కార్డు బిల్లు కట్టొచ్చు.. ఇలా చేయడం వల్ల డబ్బులు కట్ అవ్వవు... ఈ విధానం ఓ విధంగా మంచి  లాభాన్ని అందిస్తుంది.. ఎందుకంటే బ్యాంకుల అదనపు చార్జీల నుంచి బయట పడేందుకు మంచి మార్గం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: