ఎస్బీఐ కస్టమర్లకు కళ్ళు చెదిరే బంఫర్ ఆఫర్..!!
తాత్కాలికం గా క్యాష్ విత్ డ్రాయెల్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుందని నివేదికలు పేర్కొంటున్నాయి. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం కస్టమర్ల కు ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బ్యాంక్ కస్టమర్లు డబ్బులు విత్‌డ్రా చేసుకోవడాని కి హోమ్ బ్రాంచ్ కు వెళ్ళాల్సిన పనిలేదు.. దగ్గర లోనే ఉన్న ఎస్బీఐ బ్యాంక్ లో దాదాపు లక్షకు పైగా తీసుకోవచ్చు. ఇలా చేయడం జనాలకు సులువుగా అవుతుందని వెల్లడించారు..
చెక్ బుక్ ద్వారా రోజుకు రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అదే సేవింగ్స్ బ్యాంక్ పాస్ బుక్, విత్ డ్రాయెల్ ఫామ్ ద్వారా అయితే రోజుకు రూ. 25 వేల వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా థర్డ్ పార్టీ క్యాష్ విత్ డ్రాయెల్కు కూడా బ్యాంక్ అనుమతి ఇచ్చింది. నెలకు చెక్ ద్వారా రూ.50 వేలు తీసుకోవచ్చు. ఇకపోతే ఎస్బీఐ కొత్త సర్వీస్ చార్జీలు జూలై 1 నుంచి అమలు లోకి వస్తాయి. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కు సంబంధించి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్, చెక్ బుక్, ట్రాన్స్ఫర్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సవరించిన కొత్త సర్వీస్ చార్జీలు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది.. ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..