ఈ చిట్కాలు పాటిస్తే మీ బిజినెస్ అదుర్స్ అంతే ?
* ముందుగా మీరు ఏ వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. మీ పరిస్థితులకు, మీకున్న వనరులకు, అక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండే వ్యాపారాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఇది చాలా ప్రధానం.
* మీరు ఏ వ్యాపారాన్ని చేయాలనుకున్నా, చిన్న స్థాయిలో మాత్రమే ప్రారంభించాలి. మొదటి సారి చేసే వ్యాపారులు భారీగా వ్యాపారాన్ని మొదలు పెట్టడం మంచిది కాదు.
* ఆ తర్వాత మెల్లగా వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో వచ్చే లోటుపాట్లను సవరించుకుంటూ చాలా తెలివిగా వ్యాపారాన్ని విస్తరించుకోవాలి.
* కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి. అటువంటి వాటిని మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి పెట్టుబడి కూడా తక్కువగానే అవసరం అవుతుంది. కాబట్టి రిస్క్ కూడా తక్కువే.
* మీరు వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత లాభం లేదా నష్టం గురించి కొంత కాలం ఆలోచించకూడదు. మొదటగా ఏ వ్యాపారమైనా లాభాల్లోకి వెళ్లిపోదు. అలా అనుకుంటే ప్రతి ఒక్కరూ వ్యాపారమే చేస్తారు.
* వ్యాపారంలో ఓపికగా వ్యవహరించాలి. సమయానికి తగినట్లుగా స్టెప్ తీసుకోగలగాలి. ప్రజలను మీ వ్యాపారానికి ఆకర్షితులయ్యేలాగా మీ ప్రణాళికలు ఉండాలి.
* ముఖ్యంగా వ్యాపారంలో బాగా స్థిరపడిన వారిని మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. అప్పుడే మీలో ఒక వ్యాపార స్ఫూర్తి రగులుతుంది. తద్వారా మీరు వ్యాపారంలో మరింత ఎత్తుకు ఎదగడానికి అది తోడ్పడుతుంది.
* వ్యాపారం ద్వారా సంపాదించడం ప్రధానమే. కానీ ఈ సంపాదన అవినీతి, మోసం ద్వారా వచ్చేదై ఉండకూడదు. మీరు నీతిగా కస్టమర్ ను మోసం చేయకుండా వ్యాపారాన్ని చేయాలి. అప్పుడే మీకు కస్టమర్స్ దగ్గర మంచి పేరు లభిస్తుంది.
ఇలా పైన తెలిపిన సలహాలు మరియు సూచనలను పాటిస్తూ మీ వ్యాపారాన్ని మొదలు పెట్టండి అంతా శుభమే జరుగుతుంది.