ఆడ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడుతున్న ఆనంద్ మహీంద్ర..

Divya

సీ ఎస్ ఆర్.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( కార్పొరేట్ సామాజిక బాధ్యత ).. ప్రస్తుతం భారత దేశంలో ముఖ్యంగా వంద కంపెనీలకు పైగా ఈ సీ ఎస్ ఆర్ లో భాగం పంచుకుంటున్నాయి. ఇక అందులో భాగంగానే ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా గ్రూప్  వంటి ఎన్నో కార్పొరేట్ దిగ్గజాలు ఈ సీ ఎస్ ఆర్ లో భాగం పంచుకుంటున్నాయి. ఇక ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, తాము సంపాదించిన మొత్తంలో కనీసం వారికి తోచినంత డబ్బును పేద ప్రజలకు కేటాయించడం. ఇక అందులో భాగంగానే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి పాటుపడుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆడపిల్లల భవిష్యత్తుకు ఎలాంటి సహాయాన్ని అందిస్తోంది. అందులో వారికి వచ్చిన రాబడిలో ఎంత మొత్తం కేటాయిస్తున్నారు అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా 2018 - 2019 ఆర్థిక సంవత్సరానికి గాను, వారు సంపాదించిన మొత్తంలో కేవలం సీఎస్ఆర్ కోసం  రూ.93.50 కోట్లను ఖర్చు చేసింది. ఇక ఇందుకు పాటుపడిన వ్యక్తి మహీంద్రా అని చెప్పవచ్చు. ఆయన సమాజంలో ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఇక అందులో భాగంగానే ఆడపిల్లలకు సహాయం చేయాలని ఆలోచించారు. ఆనంద్ మహీంద్రా కేవలం మహీంద్రా కంపెనీ అధినేత మాత్రమే కాదు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ (ఎన్ఎస్డిఎఫ్) తో పాటు ఇండియా కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సభ్యులు కూడా..


ఆనంద్ మహీంద్ర 1996లోనే నాన్సీ కాశీ పేరిట ఒక ప్రాజెక్టును ప్రారంభించారు.ఇక ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆడ పిల్లలకు ఉచితంగా  విద్యను అందించడం. ఇక ఎవరైతే పేదరికంతో జీవితం గడుపుతున్నారో అలాంటి వారిలో ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ఆడ పిల్లలకు ఉచితంగా విద్యను అందించడంతో పాటు వారికి కావలసిన అవసరాలను తీర్చడం. ఇక అంతే కాదు ఆడపిల్లల కుటుంబాలకు కూడా తమ సహకారాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.  ఇక ఎప్పటికీ సీ ఎస్ ఆర్ లో భాగంగా,   పలు రకాలుగా ఎంతో మంది బాలికలను ఆదుకుంటున్నారు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: