ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక..

Satvika
ఈ మధ్య కాలం లో కొన్ని బ్యాంకుల సర్వీసులకు అంతరాయం కలుగుతున్న సంగతి తెలిసిందే. దేశీయ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ తో సహా అన్నీ బ్యాంకులు కూడా కొన్ని సేవలను నిలిపివేసింది. దాంతో కొన్ని రోజులు జనాలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలే కరోనా మహమ్మరి పంజా విసురుతుంది. ఇప్పుడు మరో ప్రైవేట్ బ్యాంక్ కూడా తమ ఐదు సర్వీసుల ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా క్రెడిట్ కార్డుకు సంబందించిన సేవలట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ బ్యాంక్ అందిస్తున్న క్రెడిట్ కార్డుదారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. క్రెడిట్ కార్డు పై ట్రాన్సాక్షన్ కంట్రోల్ ఫెసిలిటీ అందుబాటులో ఉండదని బ్యాంక్ కస్టమర్ల కు తెలిపింది. కస్టమర్లకు  ఈ విషయం పై ఎస్ఎంఎస్ పంపించింది. విషయానికొస్తే.. క్రెడిట్ కార్డు పై ట్రాన్సాక్షన్ కంట్రోల్ ఫెసిలిటీ జూన్ 30 వరకు అందుబాటు లో ఉండదని  చెప్పుకొచ్చింది. అందుకు కారణం మెయింటెనెన్స్ అని సదరు బ్యాంక్ వివరించింది.


ఈ తాత్కాలిక అంతరాయాని కి చింతిస్తునంట్లు తెలిపింది. ట్రాన్సాక్షన్ కంట్రోల్ ఫీచర్ వల్ల కార్డు ద్వారా జరిపే లావాదేవీల పై నియంత్రణ ఉంటుంది. మేనేజ్ కార్డు ద్వారా ఈ కార్డు వివరాల ను తెలుసుకోవచ్చు. ఇందులో ట్రాన్సాక్షన్ సెట్టింగ్స్ ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఇందులో మూడు రకాల ఆఫ్షన్లు ఉంటాయి. ఏటీఎం విత్ డ్రా, అలాగే ఆన్ లైన్ లో మని ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇక చివరిది ఇంటెర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనే మూడు ఆఫ్షన్లు ఉన్నాయి. కార్డు ఎనేబుల్, డిసేబుల్ కూడా ఉంటుంది. వాటి ద్వారా ట్రాన్క్షక్షన్ ను కొనసాగించవచ్చు. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమస్యల వల్ల చాలా మంది  ఇబ్బందులు పడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: