బిజినెస్ : రూ.416 ఆదాతో కోట్లల్లో ఆదాయం..
ఆ స్కీం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. దీనిని పీపీఎఫ్ స్కీమ్ అని అంటారు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండకపోగా, తక్కువ సమయంలో ఇన్వెస్టర్లకు మంచి లాభం ఉంటుంది. చిన్న చిన్న మొత్తంలో ఎక్కువ రాబడి పొందాలనుకుంటున్నారా..? అయితే అలాంటి వారికి ఈ స్కీం బాగా ఉపకరిస్తుంది. కాకపోతే ఇందులో మీకు కొంచెం ఓపిక ఎంతైనా అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో, వారికి ఒకేసారి భారీ రిటర్న్ లు వచ్చే అవకాశం లేదు. కానీ కొంచెం టైం పట్టినా, ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో రాబడి వస్తుందని గుర్తుంచుకోవాలి.
ఇక ఈ పీపీఎఫ్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయడం వల్ల కోటీశ్వరులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాదు ఇందులో 7.1 శాతం సంవత్సరానికి వడ్డీ కూడా లభిస్తుంది. ఇందులో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు నెలకు 12,500 రూపాయలు చొప్పున అంటే రోజుకు రూ.416 లను 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల, మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ 22.5 లక్షలు అవుతుంది. ఇక ఇందులో 7.1 శాతం వడ్డీ కూడా లభిస్తుంది కాబట్టి మీకు వడ్డీ కింద రూ.18,18,209 లభిస్తుంది. ఈ మొత్తం డబ్బును కలిపి చూసుకుంటే, 15 సంవత్సరాలలో రూ.40,68,209 అవుతుంది. మీరు కోటీశ్వరులు అవ్వాలి అంటే మాత్రం మరో పది సంవత్సరాలు మెచ్యూరిటీ కాలం పెంచుకోవడం వల్ల మీకు రూ.1,03,08,015 మీ చేతికి లభిస్తుంది.