బిజినెస్ : బ్యాంబోతో రూ. లక్షల్లో ఆదాయం.

Divya

ప్రస్తుతం డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం కాబట్టి చాలామంది డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. అలా వ్యాపారాలను మొదలు పెట్టే వారిలో మీరు కూడా ఒకరా..? అయితే మీతో పాటు ఎంతో మందికి ఒక మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. తక్కువ పెట్టుబడి తో ఓపిక ఉంటే రూ. లక్షల్లో ఆదాయం చేకూరుతుంది. అదేమిటంటే , బ్యాంబో చెట్ల పెంపకం. ఈ చెట్లను పెంచడం వల్ల ఎక్కువ మొత్తంలో రాబడిని పొందవచ్చు. సాధారణంగా ఈ బ్యాంబో లను గ్రీన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారు అంటే వీటి వల్ల మంచి ఆదాయం వస్తుంది కాబట్టి. రైతు లక్షాధికారి అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ చెట్ల పెంపకం ఎలా చేపట్టాలో తెలుసుకుందాం..
సాధారణంగా ఈ బ్యాంబో కర్రలను పరిశ్రమలలో, ఫర్నిచర్ తయారుచేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా పల్లె ప్రాంతాలలో ఈ వెదురు కర్రలను రకరకాలుగా వ్యవసాయ పనులకు ఉపయోగించడమే కాకుండా ,vఇంటి నిర్మాణంలో కూడా ఉపయోగించడం విశేషం. నష్టం లేని వ్యాపారం కాబట్టి  రైతు అతి తక్కువ సమయంలో లక్షాధికారి అవ్వచ్చు. ముఖ్యంగా ఈ చెట్లను ఎవరైతే పెంచాలి అనుకుంటున్నారో,  వారికి కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ కూడా లభిస్తుంది. ఒక్కొక్క మొక్క మీద దాదాపుగా 120 రూపాయలు సబ్సిడీ కూడా మనకు లభించడం విశేషం.
భారతదేశంలో ఈ చెట్లకు బాగా డిమాండ్ ఉంది . కాబట్టి ఈ చెట్లను పెంచి అతి తక్కువ సమయంలో మంచి రాబడిని పొందవచ్చు. ఈ మొక్కలను ఇప్పుడు గనక మీరు నాటినట్లయితే, మరో మూడు సంవత్సరాల తర్వాత నుంచి మంచి రాబడిని పొందవచ్చు. ఇక ఈ మొక్కలని మీరు ప్రతి సారి నాటవలసిన అవసరం లేదు. ఒకసారి నాటితే దాదాపు నలభై సంవత్సరాల పాటు మీకు ఆదాయాన్ని అందిస్తాయి.
ఇక ఈ మొక్కలలో దాదాపు 136 రకాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందులో బాగా ఎత్తుగా ఏపుగా పెరిగే రంగాన్ని ఎంచుకుని, నాటడం వల్ల మంచి ఆదాయం వుంటుంది. హెక్టార్ కు 1500 మొక్కల వరకు నాటవచ్చు. ఇక మొక్కకు - మొక్కకు మధ్య దూరం ఐదు అడుగులు ఉండాలి. ఇలా ఒకసారి నాటిన తర్వాత మీ మొక్కలు , చెట్లగా మారి వీటి నుంచి వచ్చే ఆదాయం రూ.మూడు లక్షల నుండి రూ. మూడున్నర లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ మొక్కలకు డిమాండ్ బాగా ఉంది .కాబట్టే మీరు వీటి పెంపకాన్ని చేపట్టవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: