బిజినెస్: తక్కువ పెట్టుబడి తో నెలకు రూ.లక్షన్నర లాభం..

Divya

కరోనా దాడికి తట్టుకోలేక.. చాలా మంది డబ్బులు లేక విలవిలలాడుతున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలోనే చాలామంది వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా ..! అని ఆలోచిస్తున్నారు.. ఇక అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం కూడా తగిన సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తోంది. మీరు చేసే ఏ వ్యాపారానికైనా మూడు దశలలో మీకు సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎలాంటి వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది అని మరికొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక అలాంటి వారికోసమే అంతే మంచి వ్యాపార పద్ధతిని మీ ముందుకు తీసుకు వచ్చాము. అదేంటో  ఇప్పుడు  చదివి తెలుసుకుందాం..
ఇటీవల కాలంలో అటుకులకు  చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ అటుకులను పులిహోర లాగా చేసుకుని, ఉదయం టిఫిన్ గా  కాని సాయంత్రం స్నాక్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఇది దక్షిణ భారతదేశంలో కూడా పాకిపోయింది. కాబట్టి దీనికి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి అటుకులు తయారు చేసే వ్యాపారం మొదలు పెడితే , తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను పొందవచ్చు. KVIC -ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సంస్థ వారు ఎలాంటి ఫుడ్ వ్యాపారాలకు బాగా సపోర్ట్ ఇస్తారు.
బియ్యం తో ని తయారు చేస్తారు కాబట్టి మీరు పోహా (అటుకులు) మిల్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఈ మిషన్ ధర రూ.2. 43లక్షలు అవుతుంది. కాకపోతే ముద్ర లోన్ కింద 90% లోన్ ఇస్తారు కాబట్టి మీరు కేవలం ఒక రూ.ఇరవై ఐదు వేలు కడితే సరిపోతుంది. ఇక మిగతా సెట్ అప్ కు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ముడి సరుకు కొనుగోలు, ప్యాకింగ్ యంత్రము, డ్రమ్ములు, కూలీలు ఇలా అన్ని ఖర్చులు పోగా దాదాపుగా  లక్షన్నర రూపాయలు కచ్చితంగా మిగులుతాయి. అయితే మీరు కె వి ఐ సి సంస్థను కలిసి ఎలా తయారు చేయాలి..? ఎలా  లాభం పొందాలి అనే విషయాలు తెలుసుకుంటే మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: