ఐసీఐసీఐ కస్టమర్లకు షాక్..?

Suma Kallamadi
బ్యాంకింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నది ఐసీఐసీఐ బ్యాంక్. భారతదేశవ్యాప్తంగా నెట్‌వర్క్ కలిగి ఉన్న ఈ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు కస్టమర్స్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ బ్యాంక్ కు బ్రాంచ్‌లున్నాయి. కాగా, ఈ బ్యాంక్ వినియోగదారులకు వచ్చే వారంలో షాక్ ఇవ్వబోతుందట.. ఆ షాక్ ఏంటంటే..
ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు వచ్చే వారం నుంచి సర్వీసు చార్జీలను పెంచబోతున్నది. క్యాష్ ట్రాంజాక్షన్స్, ఏటీఎం ఇంటర్‌చేంజ్, చెక్ బుక్ చార్జెస్ డొమెస్టిక్ సేవింగ్ ఖాతాదారులకు పెంచనున్నది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ నోటీసు పంపింది. పెంచిన ఛార్జీలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే కస్టమర్లు అలర్ట్‌గా ఉండాలి. నియమ నిబంధనలు తెలుసుకుని అవసరం మేరకే ఉపయోగించాల్సి ఉంటుంది. మెట్రో ఏరియాస్‌లోని ఆరు లోకేషన్లలో ఉండే వారికి ఫస్ట్ మంథ్‌లో చేసుకునే తొలి మూడు ట్రాంజాక్షన్స్ ఉచితమే. కాగా, తర్వాత వాటికి చార్జెస్ అప్లై అవుతాయి. మెట్రో ఏరియా కాకుండా ఇతర ప్లేసెస్‌లో ఉండేవారికి మంథ్‌లో చేసే ఫస్ట్ ఐదు ట్రాంజాక్షన్స్ ఉచితమే. కానీ, ఆ తర్వాత వాటికి చార్జెస్ ఉంటాయి. ఇక ఫైనాన్షియల్ లావాదేవీలకు రూ.20, నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు రూ.8.50 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఉచితంగా నాలుగు లావాదేవీలు చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నదన్న సంగతి తమనించాలి.
ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ ట్రాంజాక్షన్స్ చేస్తే ఒక్కో లావాదేవికి రూ.150 చొప్పున బ్యాంక్ చార్జెస్ సెపరేట్‌గా వసూలు చేయనుంది. అకౌంట్ ఉన్న బ్యాంక్ హోం బ్రాంచ్‌లో వన్ మంథ్‌లో రూపాయలు లక్ష వరకు ఎలాంటి చార్జెస్ లేకుండా తీసుకోవచ్చు. కానీ, వన్ లాక్ ‌కు మించితే రూ.150 చార్జ్ కట్టాల్సి ఉంటుంది. ఇక ఇతర బ్యాంక్ బ్రాంచెస్‌లో అయితే ఓన్లీ రూ.25 వేలకు మాత్రమే ఉచితం. రూ.25 వేలు దాటితే రూ.1,000కి రూ.5 చొప్పున వసూలు చేస్తారు.థర్డ్ పార్టీ ట్రాంజాక్షన్స్‌కు రూ.25 వేలకు ఎలాంటి సర్వీస్ చార్జ్ ఉండదు. కానీ, అంతకు మించితే కనీస చార్జీ రూ.150 కాగా, అమౌంట్‌ను బట్టి ఇంకా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: