బిజినెస్: మోడీ ప్రభుత్వం ప్రకటించిన అదిరిపోయే ఆఫర్.. రూ.5 లక్షలు మీ సొంతం..
అయితే ఈ విషయాన్ని 2021 కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది. జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద ఏడు వేల ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రూ.111 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇందుకోసం డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కు కావలసిన లోగో, ట్యాగ్‌లైన్ , పేరు సూచించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం అందరిని కోరుతోంది. దీనిలో భాగంగానే ఈ పోటీ ప్రారంభించడం జరిగింది. అయితే ఇందులో కొన్ని కేటగిరీలను కూడా డివైడ్ చేయడం జరిగింది . ఒక్కో కేటగిరి లో గెలిచిన వారికి రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి సిద్ధంగా వుంది.
ఈ పోటీలో పాల్గొనే వారు ఎవరెవరున్నారో.. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. 2021 ఆగస్టు 15వ తేదీని చివరి తేదీ గా ప్రకటించడం జరిగింది. టెస్టులో భారత పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు. ముందుగా ఎవరైతే ఈ లోగో , ట్యాగ్ లైన్ అలాగే ఇన్స్టిట్యూషన్ కు సంబంధించిన పేరును సూచించేటప్పుడు విజువల్ సిగ్నేచర్ , సులభంగా పలకడం లేదా సులభంగా గుర్తు తెచ్చుకోగలిగే అంశాలను దృష్టిలో పెట్టుకొని , వాటికి తగ్గట్టుగా రూపొందించాలని ప్రకటించింది.
ఈ పోటీకి కావలసిన పూర్తి వివరాలను https://www.mygov.in/ అనే వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.