క‌రోనాతో న‌ష్ట‌పోయారా.. అయితే ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌వ్వండి.. !

2020 -2021 సంవత్సరం లో కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా విధించిన లాక్డౌన్ తో చిన్న వ్యాపారుల‌ నుండి పెద్ద స్థాయి వ్యాపారస్తుల వరకు ప్రతి ఒక్కరు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. పల్లెల నుండి పట్టణాల వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇవే పరిస్థితులు కనిపించాయి. అయితే ఇలాంటి సమయంలోనే వ్యాపార సంఘాలు పాజిటివ్ ఆలోచనలతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మహతి మార్కెట్ ఎసెన్షియల్జ్ ఎల్ ఎల్ పీ అనే సంస్థ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ సాయంతో కలిసి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వ్యాపారుల వరకు ప్రతి వ్యాపారవేత్తలు, కొత్త‌గా వ్యాపారాన్ని ప్రారంభించాల‌నుకునేవారు వ్యాపార‌వృద్ధికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై స‌ల‌హాలు సూచ‌న‌ల‌ను అందిచ‌నుంది. 

ఈ స‌మావేశానికి బ‌డా పారిశ్రామికవేత్త‌లు హాజ‌రై చిన్న మ‌ధ్య‌స్థాయి వ్యాపార‌లకు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయ‌నున్నారు. 
వ్యాపారంలో లాభాలు రావాలంటే ఏం చేయాలి..న‌ష్టాల నుండి ఎలా గ‌ట్టుక్కాలి అనేదానిపై చ‌ర్చించి   స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు ముందుకు వ‌చ్చింది. ముఖ్యంగా చిన్న‌, మ‌ధ్య‌స్థాయి వ్యాపారులు మళ్లీ తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించుకునేలా సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి కూడా ఈ స‌ద‌స్సులో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు క‌వాల‌సిన ప‌లు సూచ‌న‌లను చేయ‌నున్నారు. ఆగస్టు 6వ తేదీన ఈ సదస్సును ప్రారంభిస్తారు. 250 మందికి పైగా వ్యాపారవేత్తలు ఆగస్టు 7వ తేదీన ఈ సమావేశంలో పాల్గొంటారు. 

నెట్వర్క్ మార్కెటింగ్ అనే విధానంతో రెండు రోజులపాటు ఈ సమావేశం జరగనుంది. ఈ సదస్సులో వస్తువులను తయారుచేసే కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు హాజరవుతారు. 
అంతేకాకుండా ప్ర‌ముఖ డాక్టర్లు. ఫైనాన్షియల్ అడ్వైసర్ లు కూడా ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం దాదాపు ఆరు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా వీక్షించ పోతున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలంగాణ టూరిజం చైర్మన్ హాజరవుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఎంఎస్ఐసి జోన‌ల్ హెడ్ శ్రీనివాస్ రావు, హాజరవుతున్నారు. బ‌ల్ద‌వా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీస్ అధినేత గోపాల్ బ‌ల్ద‌వా కూడా ఈ సమావేశానికి హాజ‌ర‌వుతారు. 

ఇక ఈ స‌ద‌స్సు గురించి అభిలాష్ ఖానాపూర్ మాట్లాడుతూ... మహతి మార్కెట్ ఎసెన్షియల్ కంపెనీ వ్యాపార ఆలోచనలు పంచుకునేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
వ్యాపారస్థుల్లో నమ్మకాన్ని, ఆత్మ‌స్థైర్యాన్ని పెంపొందించ‌డానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశం ఉద్దేశ్యం ముఖ్యంగా వివిధ రకాల వ్యాపార సముదాయాలను ఒక చోటుకు చేర్చడ‌మేన‌ని తెలిపారు. ఒకే స‌మూహం కింద అన్ని రకాల వ్యాపార సంస్థలు ఉంటే వ్యాపార‌స్థుల మ‌ధ్య సహకారం అభివృద్ధి వ్యాపారం అభివృద్ధి చెందుతుంద‌ని తెలిపారు. అంతే కాకుండా వివిధ రకాల వ్యాపారస్తుల మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేయడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: