ప్రజెంట్ టైమ్స్‌లో డబ్బును అందరూ దాదాపుగా బ్యాంకుల్లోనే దాచుకుంటున్నారు. ఇకపోతే డబ్బులు తీసుకోవడానికిగాను గతంలో మాదిరిగా ప్రతీ సారి బ్యాంకు బ్రాంచెస్‌కు వెళ్లకుండా ఏటీఎంల వద్దనే మనీ తీసుకుంటున్నారు. అలా తమకు కావాల్సినంత అమౌంట్‌ను ట్రాంజాక్షన్స్ ద్వారా తీసుకుంటున్నారు. అయితే, క్రెడిట్, డెబిట్ కార్డు నుంచి మనం ఎంత మొత్తంలోనైనా అమౌంట్ తీసుకోవచ్చు. ప్రతీ సారి అనుకున్న దాని కంటే ఎక్కువగా కూడా మీరు అమౌంట్ తీసుకోవచ్చు. అలా డబ్బులు ట్రాంజాక్ట్ చేయడం వల్ల అకౌంట్ నుంచి మనీ డెడక్ట్ అవుతూనే ఉంటాయి. ఈ సమస్యకు ఓ సొల్యూషన్ ఉందండోయ్.. అదేంటంటే.. లిమిట్ సెట్ చేసుకోవడం.
అలా మీరు క్రెడిట్, డెబిట్ కార్డుకు రూ.10 వేలు లేదా రూ.20 వేలు పరిమితి విధించుకుంటే అంత లోపు మాత్రమే ట్రాంజాక్షన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ అంతకు మించి మీరు ట్రాంజాక్షన్స్ చేస్తే విఫలమవుతాయి. అలా మీరు ఇంటర్నేషనల్ ట్రాంజాక్షన్స్‌ను కూడా నియంత్రించొచ్చు. అయితే, ఇలా లిమిట్ అనగా పరిమితి విధించుకునే విధానం ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు మారుతుంది. కొన్ని బ్యాంకులు అయితే కార్డు పైన ఉన్న బటన్‌ను స్విచ్ ఆన్ చేయడం ద్వారా అనుమతిస్తే చాలు.. లిమిట్ పెట్టుకోవచ్చు. అయితే, చాలా బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా లిమిట్‌ను సెట్ చేసుకునే ఫెసిలిటీని కల్పిస్తున్నాయి. మీరు కార్డ్ ఆప్షన్‌కు వెళ్లి పరిమితి విధించాలనుకుంటున్నట్లు తెలిపి, కార్డు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
దేశీయ ట్రాంజాక్షన్స్ కోసం లేదా ఇంటర్నేషనల్ ట్రాంజాక్షన్స్ కోసం పరిమితి ఏర్పాటు చేయాలనుకుంటున్నారా లేదా ఇతర మార్పులు ఏమైనా చేయాలనుకుంటున్నారా అనే ఆప్షన్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ క్రమంలోనే క్రెడిట్, డెబిట్ కార్డుకుగాను మీరు మీకు కావలసిన ఆప్షన్‌ను ఎంచుకొని, పరిమితిని సెట్ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు లిమిట్‌ను సెట్ చేసుకునే వెసులుబాటు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులో పొందొచ్చు. మొత్తంగా లిమిట్ దాటితే మీకు డబ్బులు రావు. అయితే, ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్న క్రమంలో లిమిట్ పెట్టుకునేప్పుడు, ట్రాంజాక్షన్స్ చేసే సమయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీరు మీ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ షేర్ చేయకపోవడమే మంచిది.