ఆ చెక్కులు .. చెల్లవట .. చూసుకోండి ..

Chandrasekhar Reddy
బీజేపీ ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాలలో అనేక మార్పులు తీసుకువచ్చారు. సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ విధానాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా బీజేపీ కూడా ఆర్థిక నేరాలతో కుదేలవుతున్న బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు చేర్పులు చేసింది. వాటిలో ఒకటి విలీన ప్రక్రియ. దీనికి మొదట ఆయా బ్యాంకు ఉద్యోగుల నుండి నిరసన సెగలు తగిలినా ప్రభుత్వం వెనకడుగు వేయకుండా తాను అనుకున్నది చేసి చూపింది.
కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తున్న కొద్దీ పాత వాటికి కాలం చెల్లక మానదు. సాంకేతిక విప్లవంలో ఉన్న ప్రధాన సమస్య ఇదే. ఆ పాతవాటికే అలవాటు పడి కొత్తదానితో పనిలేదులే అనుకున్న వారికి సమస్య తప్పదు. సాంకేతికతను ఎప్పటికి అప్పుడు అందిపుచ్చుకుంటూ వచ్చిన వారికే ప్రస్తుతం ఏ సంస్థలో అయినా స్థానం లేదా ఏ విషయాన్నైనా ఉపయోగించుకోగలము. పాతలోనే ఉంటె కొత్త లోకంలో గమనించే వారు కూడా ఉండరు. ఒకప్పుడు అన్నీ కాగితాలపైనే, ఇప్పుడు అంతా కంప్యూటర్ లోనే. కాగితాల నుండి కంప్యూటర్ కు మారినట్టు మారితేనే ఏదైనా పని జరుగుతుంది.
బ్యాంకులలో కూడా గతంలో పాస్ బుక్, తరువాత కార్డులు, చెక్ బుక్స్, అనంతరం ఆన్ లైన్. వీటిలో కూడా ఒక్కొక్కటి ఏదో ఒకచోట ఆగి, కొత్తది పూర్తిగా ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఇప్పటికే అంతా ఆన్ లైన్ అయిపోతున్నాయి. అలాగే దానికి ముందున్నవి ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఓరియంటల్ బ్యాంకు మరియు యునైటెడ్ బ్యాంకు లలో చెక్ బుక్ లు, కార్డులకు కాలం చెల్లిందని, వాటిని నిర్ణిత సమయంలోగా మార్చుకోవాలని సూచించాయి. అంటే ఈ అక్టోబర్ నుండి పై రెండు బ్యాంకుల చెక్ బుక్ లు మరియు కార్డులు చెల్లవని వాటిని విలీనం చేసుకున్న పంజాబ్ నేషన్ బ్యాంకు తెలిపింది. విలీనం జరిగింది కాబట్టి ఆయా బ్యాంకుల కు సంబందించినవి మార్చేసి, పంజాబ్ నేషన్ బ్యాంకు సంబంధిత చెక్ బుక్స్, కార్డులు తీసుకోవాలని సామజిక మాధ్యమం ద్వారా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: