భీమా పాలిసీలు .. ఎన్ని ఉండొచ్చు ..

Chandrasekhar Reddy
కరోనా కాలంలో సేవింగ్ ప్రాముఖ్యత తెలిసింది ప్రజలకు. దీనితో చాలా మంది కొత్త కొత్త సేవింగ్స్ పధకాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవడం మొదలుపెట్టారు. దీనితో ఈ కాలంలో అనేక పధకాలలో ప్రజలు సేవింగ్ రూపేణా కొంత మొత్తం సంపదను దాచుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ రానప్పటికీ ఈసారి పరిస్థితులు మాత్రం ప్రజలలో కొత్త ఆలోచనలను తెచ్చాయి. అనేక భీమా పధకాలు రోజు వింటున్నప్పటికీ ఈ పరిస్థితులను స్వయంగా చుసిన తరువాత మార్పు మొదలైందని నిపుణులు అంటున్నారు. అందుకే ఇటీవల అనేక సంస్థలలో ప్రజలు సేవింగ్స్ పేరుమీద జీవితాలకు రక్షణ నిధులను ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలిపారు.
జీవిత భీమాలు సహా అనేకమైన పాలసీలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉద్యోగుల చుట్టూ పాలసీ ఏజెంట్స్ తిరిగి తమ లక్ష్యాలను సాధించుకునే వారు. కానీ ఇప్పటి పరిస్థితి మారింది, ఎవరైనా తమ వద్ద కాస్త సేవింగ్ ఉంటె వాటిని తగిన విధంగా అనేక పధకాలలో పెట్టుబడి పెట్టుకుంటున్నారు.  అయితే ఒకటి కంటే ఎక్కువ బీమాలు తీసుకోవడం తో ప్రయోజనాలు ఉంటాయా అనేది అందరికి తెలియని విషయం. జీవిత భీమాలు అనేక రకాలు ఉన్నప్పటికీ, ఏది ఎవరికి తగినదో నిర్ణయించుకొని తీసుకోవాల్సి ఉంటుంది. దీనిప్రకారం ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)లో కొత్త సభ్యుల చేరిక ఎక్కువగానే ఉన్నట్టు తేలింది.
గత జూన్ నెలతో పోలిస్తే జులై లో నికరంగా ఈపీఎఫ్ లో ఖాతాల సంఖ్య 31.28 శాతం పెరిగింది. జూన్ లో ఈ సంఖ్య 11.16 లక్షలుగా ఉండగా, జులై లో 14.65 లక్షలకు చేరింది. వీరిలో 9.02 లక్షల మంది కొత్తవారే కావడం విశేషం. మిగిలిన వారు కూడా గతంలో ఉద్యోగాలు పోవడంతో ఈపీఎఫ్ నుండి వైదొలిగి, మళ్ళీ ఉద్యోగం రావడంతో కొత్తగా సభ్యులుగా చేరుతున్నారు. దేశీయంగా ఉద్యోగాల కల్పనలో అవకాశాలు మెరుగుపడటం ఇందుకు ప్రధాన కారణం గా సదరు అధికారులు తెలిపారు. ఈపీఎఫ్ తాజా లెక్కల ప్రజారం నాలుగు నెలలుగా ఈ ఖాతాల సంఖ్య పెరుగుతుందని తేలింది. ఏప్రిల్ లో ఈ సంఖ్య 8.9 లక్షలు ఉండగా; మే లో 6.57 లక్షలుగా ఉంది. లాక్ డౌన్ కాలంలో ఈ సంఖ్య ఘననీయంగా తగ్గినా మళ్ళీ పుంజుకుంటుందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

EPF

సంబంధిత వార్తలు: