ఆడి అంతా విద్యుత్ మయం...!
తాజాగా ఈ పోటీని తట్టుకునేందుకు జర్మనీకి చెందిన ఆడి కార్ల సంస్థ కూడా విద్యుత్ కార్ల తయారీని ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా రెండు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది ఆడి సంస్థ. ఇ-ట్రాన్ పేరుతో రెండు కొత్త రకం సూపర్ కార్ల మోడల్స్‌ను ఆడి రిలీజ్ చేసింది. ఇ-ట్రాన్ జీటీ, ఇ-ట్రాన్ ఆఎస్ జీటీ అని ఈ రెండు మోడల్స్‌కు పేరు పెట్టింది. ఇ-ట్రాన్ జీటీ ధర 1.79 కోట్ల రూపాయలు కాగా... ఇ-ట్రాన్ ఆఎస్ జీటీ ధర ఏకంగ 2.04 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. ఇ-ట్రాన్ ఆఎస్ జీటీలో 475 కిలోవాట్ల విద్యుత్‌తో నడుస్తుందని... 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో మాత్రమే చేరుకుంటుందని ఆడి సంస్థ వెల్లడించింది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే... 400 నుంచి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా బ్యాటరీ సామర్థ్యం ఉందన్నారు. కేవలం 22 నిమిషాల్లోనే పూర్తిస్థాయిలో ఛార్జింగ్ అవుతాయని... కూడా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉన్న విద్యుత్ కార్లతో పోలిస్తే... అత్యుత్తమ ఫిచర్లతో... అత్యాధునిక వసతులతో కూడిన కార్లు ఇవే అని ఆడి సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. త్వరలోనే మరో నాలుగు కొత్త మోడల్స్ కూడా భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆడి ప్రకటించింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్ కార్ల కంటే కూడా ఇవి ఎక్కువ ధరగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. చూడాలి.... ఆడి విద్యుత్ కార్లకు గిరాకీ ఎలా ఉంటుందో మరి.