కాఫీ కాస్ట్ లీ గూరూ..!

frame కాఫీ కాస్ట్ లీ గూరూ..!

కాఫీ  కాస్ట్ లీ గూరూ..!


కాఫీ.. దక్షిణ భారత దేశంలో ఎక్కువగా సేవించే పానీయం. నాలుగు మాటలు...కుదిరితే ఓ కప్పు కాఫీ ఇది తెలుగు సినిమాలలో కనిపించి, వినిపించే మాట. సామన్యులకు కాఫీ ఇకపై అలవాటుగా తాగడం వీలు కాకపోవచ్చు. అంతర్జాతీయంగా కాఫీ గింజల ధరలు విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావం భారత్ లోనూ ఉండే అవకాశం ఉంది. దీంతో సామాన్యుడు కాఫీ వైపు కన్నెత్తి చూసే అవకాశాలు తక్కువ కానున్నాయి.
ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాలు, కాఫీ ని మరింత ప్రియం చేశాయని వివరిస్తున్నాయి. నూయ్ార్క స్టాక్ ఎక్సేంజీలో కాఫీ గింజల ధర ఎప్పూడూ లేనంత గరిష్టాన్ని తాకికంది. ప్రతి ఏడాది ఇంటర్లెషనల్ కాఫీ ఆర్గనైజేషన్ అక్టోబర్ ఒటకవ తేదీ వివిధ దేశాల నుంచి కాఫీ ధరలను సేకరిస్తుంది. అంతే కాదు వివిధ దేశాలలో లభ్యమయ్యె గింజల రకాలు, లభించే గింజల వివరాలు, వాటి ధర, కాఫీ రంగంలో నూతన ఆవిష్కరణలు ఇత్యాది అంశాలను క్రోడీకరించి వాటి వివరాలను ప్రపంచానికి తెలియజేస్తుంది. అంతేకాదు అదే రోజును కాఫీ డేగా వ్యవహరిస్తుంది. 2015 నుంచి కాఫీ డే జరుపుతోంది.
 కాఫీ గురించిన ప్రచారాల హోరు కన్నా గణాంకాల సేకరణ,  వ్యాపారులకు అండగా నిలవడం ఎలా ? అన్న అంశంపై  ఈ అంశం పై ఎక్కు దృష్టి పెడుతుంది.
 అంతర్జాతీయ మార్కెట్ లో కాఫీ గింజల ధరలు ఆకాన్నంటాయి. ప్రపంచ వ్యాప్తంగా కాఫీ ఎగుమతుల్లో  బ్రెజిల్ ది ప్రథమ స్థానం. ఈ దేశం వాటా అంతర్జాతీయ విఫణిలో  దాదాపు 35 శాతం పై మాటే. కాఫీ ఉత్పత్తులన్నీ   కాఫీ గంజల ధలపై ఆధారపడి ఉంటాయన్నది సుస్పష్టం. గ్రీన్ అరబికా ( వేయించని కాఫీ గింజలు) ధర గత ఏడాది తో పోలిస్తే దాదాపు 80 శాతం పై చిలుకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఆశించిన స్థాయిలో గింజల ఉత్పత్తి  పెరగక పోవడమే. బ్రెజిల్ తదితతర దేశాలలో కరవు వాతావరణం కాపీ గింజల ఉత్పత్తి పై ప్రభావం చూపింది. అంతే కాదు కోవిడా-19 కూడా ఒక  కారణం. కాఫీ వినియోగం పెరగడం, అందుకు తగ్గట్టు కాఫీ గింజలు లభ్యం కాకపోవడం వంటివి.  బ్రెజిల్ ప్రభుత్వం కూడా కాఫీ పంట సాగు చేసే రైతులకు సరైన సహకారం అందించడం లేదన్నది వ్యాపార వర్గాల ఆరోపణ.  అక్కడి  ప్రభుత్వ మద్దతు ధర ప్రతి ఏడాది దిగజారుతూ ఉంది. ఈ ఏడాది గత పన్నెండు సంవత్సరాల  కనిష్ట స్థాయిని తాకింది. దీంతో రైతులు కాఫీ సాగుకు మొగ్గు చూపడం లేదు. అంతర్జాతీయ విఫణిలో కాఫీ గింజల లభ్యత తగ్గడంతో  సహజంగానే వీటి ధర పెరింది.
కాఫీ గంజల ఉత్పత్తిలో బ్రెజిల్ తరువాతి స్థానం వియత్నాంది. అంతర్జాతీయ మార్కెట్లో  ఈ దేశం వాట 18 శాతం పై చిలుకే.  అక్కడ నెలకొన్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు కాఫీ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అక్కడ నుంచి కూడా  అంతర్జాతీయ మార్కెట్ కు కాఫీ గింజల రాకా తగ్గింది.
దీంతో పారిశ్రామిక వర్గాలు కాఫీ ధరలను మార్కెట్ కు అనుగుణంగా పెంచేశారు.  ఫలితంగా  సామాన్యుడికి కాఫీ కాస్ట్ లీ గా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: