హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీ ఆఫ‌ర్లు..!

N ANJANEYULU
ప్ర‌యివేటు రంగానికి చెందిన ప్రముఖ దిగ్గ‌జ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా భారీగా అదిరిపోయే ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఆఫ‌ర్ హెచ్‌డీఎఫ్‌సీ క‌స్ట‌మ‌ర్లంద‌రికీ అందుబాటులో ఉండ‌నుంది. ఫెస్టివ్ ట్రీట్స్ 3.0 ను ఆవిష్క‌రించింది హెచ్‌డీఎఫ్‌సీ. ఇందులో 10వేల‌కు పైగా ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకోవ‌చ్చు. రుణాలు, కార్డులు, ఈజీ ఈఎంఐ వంటి రూపంలో క‌స్ట‌మ‌ర్లు ఆఫ‌ర్ పొంద‌వ‌చ్చు. ఐఫోన్ 13 పై రూ.6వేలు డిస్కౌంట్ ఉన్న‌ది. వాషింగ్ మెషిన్‌, ప్రిజ్‌, వంటి ప‌లు ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై 22 శాతం క్యాస్ బ్యాక్‌, నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ క‌ల్పించింది.
అదేవిధంగా రుణాల‌ను పొందాల‌ని భావించే వారికి కొన్ని ప్ర‌త్యేక‌మైన ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెట్టారు. కారు లోన్ తీసుకుంటే కేవ‌లం 7.5 శాతం వ‌డ్డీరేటు మాత్ర‌మే ప‌డుతుంద‌ని హెచ్‌డీఎఫ్‌సీ వెల్ల‌డించింది. జీరో ఫ్లోర్ బెనిఫిట్ సైతం ఉన్న‌ది. అదేవిధంగా టూ వీల‌ర్ లోన్ ప్రాసెసింగ్ ఫీజును సైతం మాఫీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌ర‌ల వ‌డ్డీరేటు 4 శాతం త‌గ్గుతుంది. అదేవిధంగా ట్రాక్ట‌ర్ రుణాల‌పై కూడా జీరో ప్రాసెసింగ్ బెనిఫిట్ సౌక‌ర్యం క‌ల‌దు.
ట్రాక్ట‌ర్ ధ‌ర‌లో 90 శాతం మొత్తాన్ని రుణం రూపంలో పొందవ‌చ్చ‌ని స్ప‌ష్ట‌మైంది. క‌మ‌ర్షియ‌ల్ వెహికిల్ లోన్ మాత్రం ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ఉంటుంది. అలాగే ఎలాంటి త‌న‌ఖా లేకుండా రూ.75 ల‌క్ష‌ల వ‌ర‌కు బిజినెస్ లోన్ సైతం పొంద‌వ‌చ్చు. అదేవిధంగా అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో భాగంగా రూ.12750 వ‌ర‌కు త‌గ్గింపు కూడా ఉంటుంద‌ని వెల్ల‌డించింది. అయితే క్రెడిట్ కార్డు ద్వారా రూ.ల‌క్ష వ‌ర‌కు లేదా ఆపైన ఖ‌ర్చు చేస్తేనే ఈ బెనిఫిట్ సౌక‌ర్యం పొంద‌గ‌ల‌మ‌ని చివ‌రికి చెప్ప‌క‌నే చెప్పింది. ఇన్ని ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టి ఉన్న‌ట్టుండి రూ. ల‌క్ష వ‌ర‌కు ఖ‌ర్చు చేయాలంటే కొంత మంది క‌స్ట‌మ‌ర్లు చాలా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు తెలుస్తోంది. కొంత‌మంది పేద‌లు మాత్రం ఈ ఆఫ‌ర్ల‌ను అస‌లు న‌మ్మ‌డానికే ఇష్టం చూప‌డం లేదు. కానీ మొత్తానికి హెచ్‌డీఎఫ్‌సీ ప్ర‌వేశ‌పెట్టిన ఆఫ‌ర్లు చాలా బాగున్నాయ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: