నవంబర్ లో బ్యాంక్ లకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
అయితే నవంబర్ లో మొత్తంగా 17 రోజులు బ్యాంక్ లకు సెలవులు ఉండబోతున్నాయి. అయితే ఈ సెలవు దినాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినది కాదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పండుగలు ఉంటాయి కాబట్టి అక్కడ సెలవులు ఉంటాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నవంబర్ 4 న దీపావళి పండుగ వస్తుంది. అలాగే 7 న ఆదివారం, 13న రెండో శనివారం ఉన్నాయి. అలాగే 14 న ఆదివారం వస్తున్నాయి. అలాగే 19 న గురు నానక్ జయంతి, కార్తిక పౌర్ణమి ఉన్నాయి. వీటి తో 27న సెకండ్ శనివారం 28న ఆదివారం వస్తున్నాయి. ఈ రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని బ్యాంక్ లకు సెలువు లు ఉంటున్నాయి. దీంతో ఆయా రోజుల్లో బ్యాంక్ లు మూసి ఉంటాయి. అయితే బ్యాంక్ లు మూసి ఉన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సేవలు మాత్రం అందుబాటు లోనే ఉంటాయి.