5వేల పెన్షన్.. కేంద్రం కొత్త స్కీం..!

Chandrasekhar Reddy
కేంద్ర ప్రభుత్వం కరోనా తరువాత సామాన్యుల కోసం సరికొత్త పధకాలు ప్రవేశపెడుతుంది. అలాగే ఇప్పటివరకు పెన్షన్ లాంటి పొదుపు పధకాల జోలికి వెళ్ళేలేని వారికోసం కూడా అతి తక్కువ పొదుపుతో వీలైనంత ఎక్కవుగా పెన్షన్ పొందే స్కీం లను తెరపైకి తెస్తుంది. ఇప్పటికే అనేకం వచ్చినప్పటికీ ఒక్కసారే కాస్త పెద్దమొత్తంలో పెన్షన్ అంటే 5000 రూపాయల వరకు కావాలని భావించేవారికి ఇది రూపొందించారు. దాని కోసం ఇప్పటి నుండే కొంత పొదుపు చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. అనంతరం ఫలితాలు అందుతాయి.

ప్రస్తుత పధకం పేరు అటల్ పెన్షన్ యోజన. ఇందులో చేరి ప్రతి నెల కొద్దిమొత్తంలో పొదుపు చేసుకోగలిగితే సులభంగా ఐదువేలు పెన్షన్ గా పొందవచ్చు. ఇందులో ఆయా వ్యక్తుల వయసు పరిమితిని బట్టి పొదుపు చేసుకున్న దానిని బట్టి ప్రతి నెలా వెయ్యి నుండి ఐదువేల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఈ మొత్తం కూడా ఆయా పొదుపుదారులు నెలనెలా పొదుపు చేసుకునే మొత్తాన్ని బట్టి ఉంటుంది. ఈ పధకంలో చేరేందుకు 18-40 వయసు ఉన్న వారు అందరూ అర్హులే. ఇతర పొదుపు పధకాల మాదిరే ఇవి కూడా పోస్టల్ లేదా ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా కూడా పొందవచ్చు. పొదుపుదారులు ప్రతి నెల కొద్దిమొత్తం చొప్పున వారికి 60 ఏళ్ళ వయసు వచ్చే వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం అంటే 60 వ ఏటా నుండి ప్రతి నెల పెన్షన్ వచ్చేస్తుంది.

ఉదాహరణకు, 18 వయసు ఉన్నవారు నెలకు 42-210 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా వాళ్ళు 1000 నుండి 5000 వరకు పెన్షన్ పొందవచ్చు. 40 వయసు ఉన్న వారు 291-1454 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 18-39 వయసు ఉన్న వారు 210-1318 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. తద్వారా వాళ్ళు 1000 నుండి 5000 పెన్షన్ పొందగలరు. లాక్ డౌన్ లో పొదుపు గురించి అందరికి ఆలోచన వచ్చింది, కానీ దానికి తగిన పధకాలు ఎక్కడ లభ్యమవుతాయి అనేది మాత్రం అర్ధం కాలేదు, అటువంటి వారికి ఈ కేంద్రం ప్రవేశ పెట్టిన పధకాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఇవి కూడా సామాన్యులు, మధ్యతరగటివ్ వాళ్ళు సులభంగా కట్టుకోదగినవిగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: