రాయల్ హానీమూన్.. విమానంలో అంట..!

frame రాయల్ హానీమూన్.. విమానంలో అంట..!

Chandrasekhar Reddy
లేనోడు లేక చస్తుంటే, ఉన్నోడు అరక్క చచ్చాడని ఒక సామెత. ప్రస్తుతం వ్యాపారస్తులు తీసుకొచ్చే కొత్తకొత్త విధానాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. అసలు అలాంటి ఆలోచనలు కూడా ఆయా బుర్రలకు ఎలా వస్తాయో కానీ, అందులో కొత్తదనం అంతలా ఉంటుంది. అంత ఆశ్చర్యాన్ని కలిగించే ఆలోచనలతో ఇటీవల వ్యాపారస్తులు వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఆయన ఎవరో సరాసరి రాకెట్లతో అంతరిక్షంలోకి వెళ్లే సౌకర్యాన్ని పర్యాటక విభాగంగా మార్చేసినట్టు మరి వింతగా, అసలు అవి జరిగే వరకు నమ్మశక్యం కానివిగా ఈ తరం వ్యాపార ధోరణులు ఉంటున్నాయి. చివరికి రాకెట్లు ఎగిరాయి, పర్యాటకులు వెళ్లి, ఎంచక్కా వచ్చేశారు కూడా. మరోసారి ప్రయాణానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఖర్చు ఎక్కువే కానీ, ఉన్నవాళ్లకు సమస్య లేదు కాబట్టి వాళ్లకు ఇలాంటివి సరదా కాబట్టి ఎలెన్ ఇలాంటి ఆలోచనతో వచ్చేసి ఉంటాడు.
తాజాగా అలాంటి మరో వింత ఆలోచన వచ్చేసినట్లుంది ఒక వ్యాపారికి. దానితో ఏకంగా హానీమూన్ ను ఆకాశంలో ఏర్పాటు చేసేశాడు. అందుకోసం ఒక ఏరోప్లేన్ ను సిద్ధం చేశాడు. అందులో నూతన దంపతులు హానీమూన్ కోసం ఏర్పాట్లు చేశాడు. దానికో పేరు కూడా పెట్టాడు, రాయల్ హానీమూన్ అని. అంటే ఇకమీదట హానీమూన్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లకుండా ఈ రాయల్ హానీమూన్ ప్లేన్ ను బుక్ చేసుకుంటే సరిపోయిద్దన్నమాట. కొత్త జంటల కోసం వీళ్లు ప్రత్యేక డిస్కౌంట్లతో కూడిన ప్యాకేజీలు కూడా ప్రకటించారు. కేవలం 995 డాలర్లతో కూడా ఇది అందుబాలోకి తెచ్చారు. ఈ కొద్దిపాటి ధరకు కేవలం 45నిముషాలు మాత్రమే దానిని వాడుకునే అవకాశం ఇస్తున్నారు. సాధారణంగా హానీమూన్ అంటే రోజులతరబడి ఉంటుంది కాబట్టి అంతకాలం గాలిలో ఎగిరే విమానాలు ఇంకా లేవనుకుంటాను.
అందుకే వీళ్లు కొద్ది లో ప్యాకేజీలు ప్రకటించారు. రోజుల తరబడి అంటే దానికి తగ్గట్టుగా భవిష్యతులో ఏర్పాట్లు ఉండొచ్చేమో, ఆ తరహా కూడా రాకుండా ఉంటాయా, ఇక్కడవరకు వచ్చిన తరువాత. అయితే ఇలాంటి కొత్త కొత్త వ్యాపార ధోరణులు ఈ సంస్థ కు కొత్తవేమీ కాదట. గతంలో ఈ సంస్థ విమానంలో పెళ్లి, విమానంలో రొమాంటిక్ డిన్నర్ లాంటివి కూడా ప్రవేశపెట్టింది. తాజాగా హనీమూన్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చింది. ఇంతకూ సంస్థ పేరు చెప్పలేదు కదా, లవ్ క్లౌడ్ జెట్ చార్టర్. పేరు బట్టే వ్యాపార ఆలోచనలు వస్తున్నట్టే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: