వార్నీ...షేర్ చాట్ ఆదాయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే !
భారతీయ కంటెంట్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ గురువారం యు.ఎస్ ఆధారిత ఆల్కియోన్ క్యాపిటల్ తో పాటు, ఇప్పటికే ఉన్న కొంతమంది పెట్టుబడిదారుల నుంచి 266 మిలియన్ల డాలర్లు తాజా నిధులను సేకరించింది, దాని విలువను 3.7 బిలియన్ డాలర్లకు పెంచింది.
ఈ సంవత్సరం షేర్‌చాట్ మూడవ ఫండింగ్ రౌండ్‌లో భాగమైన కొత్త పెట్టుబడులకు ఆల్కియోన్ నాయకత్వం వహిం చింది. అంతే కాకుండా సింగపూర్‌కు చెందిన టెమాసెక్ హోల్డింగ్స్ , మూర్ స్ట్రాటజిక్ వెంచర్స్‌తో పాటు ఇతరుల భాగస్వామ్యం కూడా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
నిధుల సమీకరణ గురించిన వివరాలను రాయిటర్స్ వార్తా సంస్థ తొలుత ప్రపంచానికి నివేదించింది. షేర్‌చాట్ జూలైలో టెమాసెకతో పాటు, ఇతరుల నుంచి సుమారు 3 బిలియన్ డాలర్ల విలువతో $145 మిలియన్లను సేకరించింది.
భారతదేశం-చైనా సరిహద్దు ఘర్షణ తర్వాత బైట్‌డాన్స్ కు చెందిన టిక్‌టాక్ తో పాటు, కొన్ని ఇతర చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం గత సంవత్సరం నిషేధించింది. నాటు నుంచి భారతీయ కంటెంట్-షేరింగ్ మరియు షార్ట్-వీడియో యాప్‌లు ప్రాచుర్యం పొందాయి.
షేర్‌చాట్ - 180 మిలియన్ల క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది - వినియోగదారులను 15 భారతీయ భాషలలో కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. టిక్ టాక్ నిషేధించబడిన తర్వాత, భారతీయ సంస్థ మోజ్ అనే పేరుతో 160 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న అదే విధమైన షార్ట్-వీడియో షేరింగ్ యాప్‌ను కూడా ప్రారంభించింది . మెటా ప్లాట్ ఫారమ్స్ ను అంటే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లను తన ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది.
"మా రెండు ఉత్పత్తులు మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్నాయి... ఈ తాజా నిధులు మా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి " అని షేర్‌చాట్ సిఈఓ అంకుష్ సచ్‌దేవా ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ తన యాప్‌ల ఆర్టిఫిషియల్-ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి కూడా నిధులను ఉపయోగిస్తుందని పేర్కొంది.
భారత్ లో ఇంటర్నేట్ వినియోగం రోజు రోజుకూపెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు దేశంలోని సోషల్ మీడియా, వీడియో షేరింగ్ లను కోరుకుంటున్నారు. ఇందుకు అవసరమైన యాప్ లకోసం వెతుకుతున్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో యాప్ లు, స్ట్రీమీంగ్ ప్లాట్ఫారమ్ లద్వారా వీడియో కంటెంట్ ను ఎక్కువ వినియోగిస్తున్నారు.