బంపర్ ఆఫర్: తెలంగాణలో ప్లాట్ల వేలం.. కొనుక్కోండి..!
ఈ వేలానికి సంబంధించిన ప్రీబిడ్ సమావేశాలు ఇవాళ నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. అసలు వేలం మార్చి 14 నుంచి 17 వరకు ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. అంటే ఈ వేలానికి ఇంకా 25 రోజుల వరకూ సమయం ఉందన్నమాట. వేలంలో పాల్గొనాలనుకునే వారు అనేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా రిజర్వ్ ధర చెల్లించిన వారే వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ వివరాలు సేకరించి ముందుగా డబ్బు సిద్దం చేసుకుంటే వేలంలో పాల్గొని భూములు దక్కించుకోవచ్చు.
ప్రభుత్వం స్వయంగా వేలం వేసే భూములు తీసుకుంటే అనేక సౌకర్యాలు ఉంటాయి. భూములపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఓ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రైవేటు స్థలాలు తీసుకుంటే ఎంతగా చెక్ చేయించుకున్నా కొన్నిసార్లు మోసాలకు గురయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ప్రభుత్వమే అమ్ముతున్నప్పుడు క్లియర్ టైటిల్ తో భూములు ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి.
ఈ భూములకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కూడా త్వరగా కల్పిస్తుంది. అందుకే ఈ భూములు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ధర ఎంత ఉన్నా.. డిమాండ్ ఉంటుంది. అందుకే భూములు కొనుక్కునేవారికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. మీకు అనువైన జిల్లాను ఎంచుకుని అక్కడ భూముల వేలంలో పాల్గొనవచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను బట్టి.. మీరు ఎంతవరకూ కొనగలరో నిర్ణయించుకుని వేలంలో పాల్గొని మీకు అనుకూలమైన ప్లాట్లు సొంతం చేసుకోండి. మరి ఇంకేం త్వరపడండి..