స్టాక్ మార్కెట్ పై ఎన్నికల ఫలితాల ప్రభావం... లాభాల్లో ఇన్వెస్టర్లు ?
అయితే ఒక టెక్నిక్ గా ట్రెండ్ ను ఫాలో అవుతూ ట్రేడ్ చేసుకునే వారికి ఇది మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. ఈ రోజు మాత్రం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ లాభపడ్డారు. గత పది రోజుల రోజుల క్రిందట రష్యా మరియు యుక్రెయిన్ ల మధ్య జరిగిన యుద్ధం కారణంగా లక్షల కోట్ల రూపాయలు క్షణాల్లో ఆవిరి అయిపోయింది. ఇందుకు పూర్తి భిన్నంగా ఈ రోజు మార్కెట్ లు సాగడం అన్నది వింత పరిణామం అని చెప్పాలి. ఈ రోజు దేశీయ ఇన్వెస్టర్ల సంపద రూ. 5.4 లక్షల కోట్లకు పెరగడం విశేషం. దీనితో అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు బుల్ జోరుతో యమ స్పీడ్ గా కొనసాగాయి.
దేశీయ మార్కెట్లలో బుధవారం నాటి ర్యాలీ BSE-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పరిశీలించగా కేవలం రెండు రోజుల్లో ఆ మొత్తం రూ. 7,21,949.74 కోట్లు పెరిగి రూ. 2,48,32,780.78 కోట్లకు చేరుకున్నట్లు తెలిసింది. కాగా ఇందులో పెట్టుబడిదారులకు కూడా మంచి ఆదాయం వచ్చింది, వారి సంపద మంగళవారం రూ. 2.51 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో పెట్టుబడిదారుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ రోజు విషయానికి వస్తే నేడు ప్రారంభంలోనే మార్కెట్ సూచీ సెన్సెక్స్ 1300 పాయింట్ల పెరుగుదలను నమోదు చేయగా 16,700 పాయింట్ల మార్కును దాటినట్లు తెలిసింది.