ఇంటి నుంచే ఆధార్‌ని ఎలా వెరిఫై చేసుకోవాలి?

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. బ్యాంకింగ్, వాహన రిజిస్ట్రేషన్ ఇంకా అలాగే బీమా పాలసీలతో సహా అనేక ఇతర సేవలను పొందేందుకు ఆధార్ కార్డ్ ఉపయోగం చాలా అవసరమనే చెప్పాలి.ఇక ఆధార్ కార్డ్‌లో మీ బయోమెట్రిక్స్  ప్రామాణీకరించబడిన సమాచారం. అలాగే ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం కూడా రికార్డ్ చేయబడింది. మీ ఆధార్ కార్డును మీరు అప్‌డేట్ చేయడం కూడా అవసరం. గుర్తింపు రుజువుగా అంగీకరించే ముందు ఆధార్ కార్డ్ నంబర్‌ను వెరిఫై చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అధికారులు ఇంకా అలాగే పౌరులను మరోసారి హెచ్చరించింది. ఆధార్ కార్డ్ నంబర్‌ను ఉపయోగించే ముందు, అది యాక్టివ్‌గా ఉందో లేదో ఖచ్చితంగా నిర్ధారించుకోవాలని కూడా uidai గతంలో పేర్కొనడం జరిగింది. అలాగే దీనితో పాటుగా, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న సమాచారంతో మీ ఆధార్ కార్డ్ కి సంబంధించిన వివరాలు సరిగ్గా సరిపోతాయో లేదో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ఆధార్‌ని ఎలా వెరిఫై చెయ్యాలి?
1. ఫస్ట్ uidai వెబ్‌సైట్‌కి వెళ్లండి.www.uidai.gov.in.
2. ఆ వెబ్‌సైట్‌లో 'ఆధార్ సర్వీసెస్' కింద 'వెరిఫై ఆధార్ నంబర్'పై మీరు క్లిక్ చేయండి.ఇక ఇలా చేయడం వల్ల కొత్త పేజీ అనేది ఓపెన్ అవుతుంది.
3. ఇక ఆ కొత్త పేజీలో, మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్ ఇంకా అలాగే క్యాప్చా నమోదు చేయండి.
4. ఆధార్ నంబర్ నిజమైనదైతే, వెబ్‌సైట్ 'ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్' అనే మెసేజ్ ని మీకు చూపుతుంది. అలాగే ఇతర వివరాలు కూడా చూపబడతాయి. మీ వయస్సు, మీ రాష్ట్రం పేరు ఇంకా అలాగే మీ మొబైల్ నంబర్ చివరి మూడు అంకెలు వంటివి చూపబడతాయి.
5. అనేక ప్రయత్నాల తర్వాత కూడా, ఆధార్ కార్డ్ నంబర్‌ వెరిఫై కావడంలో విఫలమైతే, ఆధార్ కార్డ్ నంబర్ ఉనికిలో లేదని అర్థం. ఇక అప్పుడు మీరు అవసరమైన పత్రాలతో సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి.
6. మీ బయోమెట్రిక్‌లు మళ్లీ వెరిఫై చేయబడతాయి.ఇంకా అలాగే uidai డేటాబేస్‌లో నమోదు చేయబడతాయి. ఇక దీని కోసం, మీకు రూ. 25తో పాటు 18% చొప్పున GST కూడా విధించబడుతుంది. తరువాత మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: