LIC : సూపర్ పాలసీ.. కేవలం 29/- పొదుపుతో లక్షల లాభం!

Purushottham Vinay
ఇండియాలో పెద్ద బీమా రంగ కంపెనీల్లో ఒకటైన ఎల్ఐసీ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. దీని వలన ఎంతో మందికి కూడా లాభదాయకంగా ఉంటుంది. అయితే ఎల్ఐసీ వారు అందించే పాలసీల్లో కొన్ని స్పెషల్ పాలసీలు కూడా వున్నాయి.ఇక వాటిలో ఆధార్ శిలా కూడా ఒకటి. ఈ పాలసీ వలన అదిరే లాభాలను మనం పొందొచ్చు. ముఖ్యంగా మహిళల కోసం స్పెషల్ గా ఈ పాలసీని తీసుకు రావడం జరిగింది.ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల లోకి వెళితే.. ఆధార్ కార్డు కలిగిన మహిళలు ఎవరైనా కాని ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని తీసుకోవడం వలన ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. మహిళలు కనుక ఈ పాలసీ తీసుకుంటే.. వారికి రోజుకు రూ.29 పొదుపుతో మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 4 లక్షలు వస్తాయి.ఇందులో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది.


ఇక ఈ పాలసీకి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే.. 8 నుంచి 55 సంవత్సరాల మధ్యలో వయసు కలిగిన వారు దీనికి అర్హులు. పదేళ్ల నుంచి 20 ఏళ్ల దాకా కాల పరిమితితో ఆధార్ శిలా పాలసీని పొందొచ్చు. అలాగే మెచ్యూరిటీ సమయంలో 70 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక ఎంత వరకు డబ్బులు పెట్టచ్చు అనే విషయానికి వస్తే..ఇక రూ.75 వేల కనీస బీమా మొత్తంతో ఈ పాలసీని పొందొచ్చు. మాక్సిమం అయితే రూ.3 లక్షల దాకా బీమా మొత్తానికి పాలసీ పొందొచ్చు.నెల, మూడు నెలలు, ఆరు నెలలు ఇంకా అలాగే ఏడాది చొప్పున ప్రీమియం డబ్బులను కట్టవచ్చు. ప్రీమియం డబ్బులు ఇంకా డెత్ క్లెయిమ్‌పై ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వున్నాయి. ఇక ఎలా డబ్బులొస్తాయి అనే విషయానికి వస్తే.. 20 సంవత్సరాల వయసులో ఉన్న వారు 20 ఏళ్ల కాల పరిమితితో రూ. 3 లక్షల బీమా మొత్తానికి పాలసీ గనుక తీసుకుంటే.. వార్షిక ప్రీమియం వచ్చేసి రూ.10,800 ఉంటుంది. ప్రతి రోజు కూడా మీరు కేవలం రూ.29 పొదుపు చేస్తే చాలు. ఇక మెచ్యూరిటీ సమయంలో రూ. 4 లక్షల వరకు మీకు వస్తాయి.కాబట్టి అర్హత ఇంకా అలాగే ఆసక్తి వున్న వారు ఖచ్చితంగా ఈ పాలసీని తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

LIC

సంబంధిత వార్తలు: