మీ ఆధార్ కార్డ్ కి ఎన్ని మొబైల్ నంబర్‌లు రిజిస్టర్ అయ్యాయో వెరిఫై చేయడం కూడా చాలా కీలకం ఇంకా మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్లు జారీ అయ్యాయో తెలుసుకోవాలంటే, మీరు దానిని TAFCOP అనే టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) పోర్టల్‌లో చేయవచ్చు. TAFCOP (టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్) మీ ఆధార్ నంబర్‌లో ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రత్యేకంగా జారీ చేసిన నిబంధనల ప్రకారం, ఒక పౌరుడు కేవలం 9 మొబైల్ నంబర్‌లను మాత్రమే ఆధార్ కార్డ్‌కి అనుసంధానించవచ్చు.
ఏ వ్యక్తి అయినా ఇప్పుడు ఉపయోగంలో లేని మొబైల్ ఫోన్ నంబర్‌లను గుర్తించడానికి ఇంకా నివేదించడానికి పోర్టల్‌ని ఉపయోగించుకోవచ్చు. మీ అభ్యర్థనను విజయవంతంగా సమర్పించిన తర్వాత ఏదైనా TAFCOP పోర్టల్ మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేస్తుంది లేదా నిష్క్రియం చేస్తుంది. వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ చేసి, "రిక్వెస్ట్ స్టేటస్" విభాగంలో 'టికెట్ ID రెఫ్ నంబర్'ని నమోదు చేయడం ద్వారా వారి అప్లికేషన్‌ల స్టేటస్ ని కూడా చెక్ చేయవచ్చు.
మీ ఆధార్ కార్డ్ కి సంబంధించిన మొబైల్ నంబర్‌లను చెక్ చేయడానికి ఇంకా అలాగే ధృవీకరించడానికి దశలు :
దశ 1: TAFCOP వెబ్‌సైట్‌ను (https://tafcop.dgtelecom.gov.in/) సందర్శించండి. ఇంకా మీరు ధృవీకరించాల్సిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
దశ 2: 'రిక్వెస్ట్ OTP'పై క్లిక్ చేసి, 6-అంకెల OTPని నమోదు చేయండి.
దశ 3: ఇప్పుడు 'వాలిడేట్'పై క్లిక్ చేయండి మరియు మీరు మీ IDలలో నమోదు చేయబడిన మొబైల్ నంబర్‌ల లిస్ట్ ని పొందుతారు.
గమనిక: మీరు మీ పేరులో లేని లేదా అవసరం లేని నంబర్‌లను ఎంచుకోవచ్చు. ఇంకా మీ నివేదికను సమర్పించవచ్చు. మీరు ఉంచుకోవాల్సిన నంబర్ల కోసం ఎటువంటి చర్య అవసరం లేదు.