Multibagger Stocks: లక్షను 10.50 కోట్లుగా మార్చిన స్టాక్?

Purushottham Vinay
ఇక ప్రస్తుతం టాటా గ్రూప్ ఐటి షేర్‌లు భారీ పెరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో టాటాలకు చెందిన ఒక కంపెనీ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ని అందించింది.ఒకప్పుడు మొత్తం రూ.7.68గా ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ.8,078 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఈ కాలంలో ఇన్వెస్టర్లు అయితే ఏకంగా కోటీశ్వరులుగా మారారు. గత 25 ఏళ్లలో ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో లక్ష శాతానికి పైగా రాబడిని ఈ స్టాక్ అందించడం జరిగింది.అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది టాటాలకు చెందిన Tata Elxsi స్టాక్ గురించే. ఇక ఇది ఒక ఐటీ కంపెనీ. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలమైన లాభాలను కూడా నమోదు చేసింది. వ్యాపార కార్యకలాపాల ద్వారా కంపెనీ మొత్తం రూ.725.9 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.ఇక అన్ని టాక్సులు కూడా చెల్లించిన తరువాత మొత్తం రూ.184.7 కోట్ల లాభాన్ని గడించింది. కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు మొత్తం రూ.50,250.24 కోట్లుగా ఉంది.ఇక భారతీయ స్టాక్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన రాబడిని అందించిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో టాటా గ్రూప్ కు చెందిన Tata Elxsi ఒకటి. టాటా Elxsi షేర్ YTD ప్రాతిపధికన మొత్తం 36.67% రాబడిని ఇచ్చింది.


ఈ కాలంలో చాలా IT స్టాక్‌లు కూడా తమ పెట్టుబడిదారులకు సున్నా రాబడిని ఇచ్చాయి. ఈ ఐటీ స్టాక్ గత ఏడాది కాలంలో మొత్తం 80 శాతం రాబడిని అందించగా.. గత 5 సంవత్సరాల్లో అయితే ఏకంగా 858.47 శాతం రాబడిని ఇచ్చింది.ఇక 25 సంవత్సరాల క్రితం జూలై 11, 1997న BSEలో ఈ షేర్ ధర వచ్చేసి రూ.7.68గా ఉంది. ఈ రోజు మార్కెట్ విలువ ప్రకారం ఈ స్టాక్ రేటు మొత్తం రూ. 8,078 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ గత 9 ఏళ్లలో మొత్తం 9274.09% రాబడిని ఇచ్చింది. ఈ సమయంలో 23 ఆగస్టు 2013న.. స్టాక్ రూ.86.13 నుంచి ప్రస్తుత ధరకు బాగా పెరిగింది. ఇంకా అలాగే 25 సంవత్సరాల క్రితం ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్ లో లక్ష రూపాయిలు పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రస్తుతం దాని విలువ వచ్చేసి రూ. 10.50 కోట్లు అయి ఉండేది. ఈ స్టాక్ లో దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు మంచి రాబడిని పొందడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: