ఖర్చులు ఇలా మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉండదు?

Purushottham Vinay
లైఫ్ లో అప్పులు పాలు కాకుండా డబ్బులు మిగిలించుకోవాలంటే ఒకటి బాగా డబ్బులు వచ్చే జాబ్ కానీ వ్యాపారం కాని చెయ్యాలి ఇక ఆ డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలి. డబ్బు దాచుకోకుండా మీరెంత సంపాదించినా వేస్ట్.ఎంత సంపాదించామని కాదు ఎంత సేవ్ చేసుకున్నాం అనేది గుర్తుంచుకోవాలి.ఖర్చులను తెలివిగా నిర్వహించాలంటే ముందుగా మీ ఆర్థిక స్థితి తెలుసుకోవాలి. మీరు నెల నెలా ఎంత సంపాదిస్తున్నారు?ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలుస్తే.. ఎలా తగ్గించుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే దాదాపు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీంతో కాల్స్‌తో పాటు డేటా కోసం వందలు వెచ్చించి డేటా ప్యాక్ కొనుగోలు చేస్తుంటాం. ఇంట్లో వైఫై ఏర్పాటు చేస్తుంటాం. ఇక టీవీ, ఓటీటీ, ఆన్‌లైన్ షాపింగ్‌, జిమ్ వంటి చాలా వాటిలో సభ్యత్వం తీసుకుంటుంటాం. వీటన్నింటినీ విడిగా చూస్తే నెలకు రూ.300 నుంచి రూ.500లోపే ఖర్చువుతుంది. ఇది చాలా తక్కువనే అనిపిస్తుంది. అయితే, ఇవన్నీ కలిపి చూస్తే నెలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా మనలో చాలా మంది వీటిలో సభ్యత్వం అయితే తీసుకుంటారు గానీ పూర్తిగా వినియోగించుకోరు. అందువల్ల వీటికి అయ్యే ఖర్చులను బేరీజు వేసుకుని ఎక్కువగా వినియోగించని సభ్యత్వాలను రద్దు చేసుకోవడం వల్ల ప్రతి నెలా వందల్లో ఖర్చు తగ్గించుకోవచ్చు.అలాగే షాపింగ్ చేసేటప్పుడు వస్తువులను కొనుగోలు చేసేందుకు చాలా ఖర్చు చేస్తుంటాం.  


ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం ప్రముఖ బ్రాండ్లు అందించే ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటాం. వ్యాపారం పెంచుకొనేందుకు సంస్థలు అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితం, భారీ తగ్గింపు వంటి ఆఫర్లతో ముందుకు వస్తుంటాయి. అలాంటప్పుడు మన వద్ద ప్రొడక్ట్ ఉన్నప్పటికీ.. తక్కువకు వస్తుందనే ఉద్దేశంతో మళ్లీ కొనేస్తుంటాం. కానీ ఇలాంటి ఉత్పత్తులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. మీ వద్ద ఉన్న వస్తువు పూర్తిగా ఉపయోగించి కొత్త వస్తువును వాడే సమయానికి దాని ఎక్స్‌పైరీ డేట్ ముగిసిపోవచ్చు. దీంతో ఆ ప్రొడక్ట్ పనికి రాకుండా పోతుంది. దానిపై వెచ్చించిన డబ్బు మొత్తం వృథా అవుతుంది. ఇలాంటివి ఖర్చు చేసేటప్పుడు తెలియవు. కాబట్టి ముందు నెలల్లో చేసిన ఖర్చులను ఒక దగ్గర రాసుకుంటే.. ఎక్కడ ఎంత ఖర్చవుతుందో మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఎక్కడ వృథా అవుతుందో ఒక అంచనాకు రావచ్చు. దీంతో అవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు.అలాగే ఇతరుల మెప్పు కోసం అస్సలు ఇంట్లో పెద్ద పెద్ద వస్తువులు కానీ గాడ్జెట్స్ కానీ కొనకండి. మీ స్థాయిని బట్టి డిసైడ్ చేసుకోండి. మీకు వచ్చే సంపాదన ఎంత? అందులో మీకు మిగిలేది ఎంత? అనే విషయాలు ఆలోచించుకొని ఏదైన కొనుక్కోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: