PF అకౌంట్ వున్నవారికి గుడ్ న్యూస్?

frame PF అకౌంట్ వున్నవారికి గుడ్ న్యూస్?

Purushottham Vinay
ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి సమాజంలో మంచి గుర్తింపు అనేది ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గౌరవం అనేది ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి పిఎఫ్ అకౌంట్ ఉండడం అనేది చాలా సర్వసాధారణ విషయం. ఇక ప్రతి నెల కూడా వారి జీత భత్యాలనుంచి కొంత అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే పిఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులకు ప్రభుత్వం వడ్డీని చెల్లిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా 2022వ ఆర్థిక సంవత్సరానికి గాను పిఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బును బట్టి 81 శాతం వడ్డీలను తమ అకౌంట్లోకి జమ చేయనుంది. అయితే వడ్డీ డబ్బులు మన అకౌంట్లో పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే మీరు సింపుల్ గా ఇలా చేస్తే చాలు.ఎవరికైతే పిఎఫ్ అకౌంట్ లో పది లక్షలకు పైగా నిల్వ అనేది ఉంటుందో అలాంటి వారికి మొత్తం 81 వేల రూపాయల వడ్డీని ప్రభుత్వం చెల్లించనుంది.


ఇంకా అలాగే లక్ష రూపాయలు ఉన్నవారికి మొత్తం 8100 రూపాయల వడ్డీ వారి అకౌంట్లో పడుతుంది. అయితే మన అకౌంట్లో ఉన్న డబ్బును బట్టి అందుకు సరిపడా వడ్డీ అనేది చెల్లించనున్నారు. ఇకపోతే ఈ డబ్బులు మన అకౌంట్లో పడ్డాయో లేదో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఇక పీఎఫ్ వడ్డీ డబ్బులు అనేవి మన అకౌంట్ లో పడ్డాయో లేదో తెలుసుకోవడం కోసం ముందుగా మీరు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం లేదా ఉమాంగ్ యాప్ ద్వారా డబ్బులు క్రెడిట్ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. లేదంటే సింపుల్ గా 011-22901406 నెంబర్ కి మిస్సేడ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మన అకౌంట్లో ఈ వడ్డీ డబ్బులు క్రెడిట్ అయ్యాయా లేదా అనే విషయాలను ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే అందరికీ కూడా ఈ డబ్బులు 81 వేల రూపాయలు పడవు. ఎందుకంటే మన అకౌంట్లో ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బుకు 81 శాతం వడ్డీని మాత్రమే చెల్లిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

EPF

సంబంధిత వార్తలు: