పీఎం-కిసాన్: 13వ విడత డబ్బు కోసం ఇలా చెయ్యాల్సిందే?

Purushottham Vinay
ఇక దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సాహించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చేందుకు అలాగే పెట్టుబడి సాయం అందించేందుకు ఇంకా అలాగే పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ఇప్పటికే ప్రణాళికలను కూడా రూపొందించడం జరిగింది.ఇక దీనిలో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ఫిబ్రవరి 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించి.. రైతులకు తన వంతు ఎంతగానో చేయూతనిస్తోంది. ఇక ఈ పథకం కింద భూమి ఉన్న ప్రతీ రైతుకు కూడా ప్రభుత్వం ఏడాదికి రూ. 6,000 చొప్పున డబ్బును అందిస్తోంది. ఈ ఆరు వేల డబ్బును కూడా మూడు వాయిదాలలో రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేస్తోంది. ఇక దీనికోసం వేలాది కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించి.. నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.


అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన 12వ విడత నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఇందుకు లబ్ధిదారులైన రైతులు 13వ విడత కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.తాజాగా తెలుస్తున్న నివేదికల ప్రకారం.. PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత నగదు ఈ సంవత్సరం డిసెంబర్ 15 నుంచి 20 వరకు విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.అయితే దీనిపై ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర pmkisan.gov.inలో అందుబాటులో ఉంచుతుంది.ఇక వీటికి అర్హులైన రైతులు PM కిసాన్ యోజనను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ని కూడా విజిట్ చేయవచ్చు.ఇంకా అలాగే దశల వారీ ప్రక్రియతో సహా వివరాలను చెక్ చేయవచ్చు.కాబట్టి ఆ వెబ్ సైట్  ఓపెన్  చేసి ఒక సారి చెక్  చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: