ప్రస్తుత కాలంలో అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటోన్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. తమకు అనుకోని ప్రమాదం ఏదైన జరిగినా తమపై ఆధారపడే కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో జీవిత భీమాను చాలా మంది కూడా తీసుకుంటున్నారు.ఇక ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం ప్లాన్ చేసుకుంటున్న వారి కోసం ఒక మంచి ప్లాన్ అనేది ఉంది. టాటా గ్రూప్ అందిస్తోన్న ఈ ప్లాన్‌తో ఏకంగా రూ. 10 లక్షల బీమా బీమాదారుడి కుటుంబానికి అందుతుంది. ఈ పాలసీని ఇండియా తపాలా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా పొందొచ్చు. టాటా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీ పేరుతో ఉండే ఈ బీమాను తపాలా శాఖ ద్వారా ప్రజలకు ఇస్తున్నారు. ఇక ఈ బీమా ప్లాన్‌లో ఎంత చెల్లించాలి.? ఎవరు దీనికి అర్హులు లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..ఈ టాటా గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీలో కేవలం రూ. 399 ప్రీమియం చెల్లించాల్సి ఉంఉటంది. 18 నుంచి 65 ఏళ్ల వయసు దాకా ఈ పాలసీలో చేరొచ్చు. ఇక ఈ పాలసీ తీసుకోవాలనుకునే వారికి కచ్చితంగా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ అనేది ఉండాలి.
ఈ బీమా తీసుకోవాలనుకునే వారు నేరుగా పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ బీమా తీసుకున్న పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో చనిపోయినా లేదా శాశ్వత అంగవైకల్యం వచ్చినా లేదా పక్షవాతం సంభవించినా రూ.10 లక్షలు అనేవి నామినికీ అందిస్తారు.ఇంకా అంతే కాకుండా పాలసీదారుడికి చదువుకొనే ఇద్దరు పిల్లలు కనుక రూ. లక్ష ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. అలాగే 24 గంటలకు పైగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటే రూ.60 వేల వరకూ బిల్లుని చెల్లిస్తారు. అలాగే 24 గంటలలోపు ఆసుపత్రి నుంచి వైద్యం తీసుకుని బయటకు వచ్చేస్తే రూ.30 వేలు లేదా బిల్లు ఎంత అయితే అంత వారు ఇస్తారు.ఇక ఈ రెండింటిలో కూడా ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి లేదా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకోవడానికి మాక్సిమం రూ.25 వేలు లేదా బిల్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది ఈ పాలసీలో ఇస్తారు. ఇక పాలసీదారుడు కనుక మృతి చెందితే రూ. 5 వేలు అంత్యక్రియల కోసం అందిస్తారు.