ATM : అసలు సర్వీస్ చార్జెస్ పడకుండా ఎలా వాడాలి?
ఇక బ్యాంకు వినియోగదారులు ప్రతి నెల కూడా వారి బ్యాంక్ ఏటీఎంలలో (ATM) 5 సార్లు ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇంకా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే కేవలం 3 సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలు చేయడానికి వీలుంటుంది. నాన్ మెట్రో కేంద్రాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే వినియోగదారులు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు.ఇక ఇలా చేయడం ద్వారా చార్జీలు పడకుండా ఫ్రీగా వాడుకోవచ్చు..లిక్విడ్ క్యాష్ చెల్లించడానికి ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేసే బదులు మీ ఎటిఎం కార్డ్‌ని స్వైప్ చేయవచ్చు. చాలా మంది వ్యాపారులు ఇంకా విక్రేతలు ఇప్పుడు కార్డ్ రీడర్లను ఉపయోగిస్తున్నారు. ఇది ఏటీఎం లావాదేవీ చార్జీలను కూడా ఆదా చేస్తుంది.మీ బిల్లులను ఖచ్చితంగా ఆన్లైన్లో చెల్లించండి. మీ సమయానికి అనుగుణంగా.. మీ బ్యాంక్ అకౌంట్ నుండి నేరుగా చెల్లింపులను చేస్తే సమయంతో పాటు చార్జీలు కూడా తగ్గుతాయి.
అలాగే ఏటీఎం లలో ఉచిత విత్ డ్రా అవకాశాలను ఎమర్జెన్సీ సమయంలో వాడుకునేందుకు వీలుగా అట్టిపెట్టుకోవాలి. మీకు ఛాన్స్ ఉన్నంత వరకూ మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వాడుకొని బ్యాలెన్స్ ఎంక్వయిరీ ఇంకా మినీ స్టేట్మెంట్లు మొదలైన ఆర్థికేతర లావాదేవీలు చేయవచ్చు.ఆర్థిక లావాదేవీలను చేయడానికి మీ బ్యాంక్ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోండి. మీ బ్యాంక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని లావాదేవీలు చేయవచ్చు.ఛాన్స్ ఉన్నంత వరకూ మీ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలను మాత్రమే వినియోగించాలి. అప్పుడు అదనపు చార్జీలు లేకుండా లావాదేవీలు చేయవచ్చు.ఇంకా అలాగే మీ బ్యాంకు సంబంధించిన నెట్ వర్క్ ఏటీఎంలు ఏమైనా ఉన్నాయేమో మీరు వెతకాలి. అంటే మీ బ్యాంకు ఇతర బ్యాంకులు అలాగే సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంటే ఆయా సంస్థల ఏటీఎంలలో కూడా ఫ్రీ విత్ డ్రా కు అవకాశం ఉంటుంది.