ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ అనేది బాగా పాపులర్ అయ్యింది. అందరూ కూడా జోమాటో, స్విగ్గీ వంటి యాప్ ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం ఇక నిమిషాల్లోనే నచ్చిన ఫుడ్ ని ఇంట్లోనే ఉండి తిని ఆస్వాదించడం చేస్తున్నారు.ఈమధ్య కాలంలో ఈ ట్రెండ్ అయితే బాగా పెరిగింది. హోటల్ కి వినియోగదారునికి మధ్య వారధిగా ఈ ప్రైవేటు యాప్స్ అనేవి ఉంటున్నాయి. అయితే ఈ ప్రైవేటు యాప్ లలో ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉండటంతో మొత్తం ఫుడ్ కాస్ట్ బాగా పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు కొంత డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇక ఓఎన్డీసీ(ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)ను తీసుకొచ్చింది. ఈ ఓఎన్డీసీ ద్వారా ఎలాంటి యాప్ల జోలికి వెళ్లకుండా డైరెక్ట్ గా హోటల్ యాజమాన్యం నుంచే ఈజీగా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు.అయితే ఇది ఖచ్చితంగా కూడా అనేక రకాల ఫుడ్ యాప్స్ కారణంగా వినియోగదారులు పడుతున్న గందరగోళానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్టే అవుతుంది.
ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఓఎన్డీసీ ద్వారా కొన్ని హోటళ్లు నేరుగా దీనిలో రిజిస్టర్ అవుతాయి. దీంతో నేరుగా ఆ హోటల్ నుంచి మనం ఫుడ్ డెలివరీలు పొందవచ్చు. ఈ ఓఎన్డీసీ మనకు 2022 సెప్టెంబర్ నుంచే అందుబాటులో ఉంది.ఈమధ్య కాలంలో ఇది కూడా బాగా పాపులర్ అయ్యింది. ప్రతి రోజూ కూడా 10,000 ఆర్డర్లు దీని నుంచి వెళ్తున్నాయి. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ ఓఎన్డీసీ యాప్ లో కొనుగోలు చేసిన ఫుడ్ ఆర్డర్ బిల్లలను వినియోగదారులు స్క్రీన్ షాట్లు తీసి ఇక వాటిని జోమాటో, స్విగ్గీ బిల్లులతో పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.అయితే ఈ నెట్ వర్క్ అనేది కొత్తది కావడం వల్ల అన్ని నగరాల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫస్ట్ ఇది సెప్టెంబర్ 2022లో బెంగళూరులో దీనిని కార్యకలాపాలు ప్రారంభించింది.ఇక పేటీఎం యాప్ సాయంతో దీనిని యాక్సెస్ చేయొచ్చు. మీ సిటీలోకి అందుబాటులో ఉందోలేదో తెలియాలంటే వెంటనే మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేస్తే మీ సిటీలో ఈ నెట్ వర్క్ అందుబాటులో ఉందో లేదో మీకు ఈజీగా తెలుస్తుంది.