జాబ్ కోసం ఎంతగానో ట్రై చేస్తున్నారా? ఎంత ట్రై చేసినా ఎక్కడా కూడా మీకు అసలు సరైన జాబ్ దొరకలేదా.? ఇంట్లోనే ఖాళీగా ఉన్నారా? అయితే మీకో అదిరిపోయే బిజినెస్ ఐడియా ఉంది.తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే. ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియా మీకోసమే..ఇక ఈ వ్యాపారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పన్లేదు. ఒక్కసారి స్టార్ట్ చేసి అంచలంచలుగా పెంచుకుంటూపోతే.. నెలకు ఏకంగా రూ. 30 వేలకుపైగా సంపాదించవచ్చు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఆ బిజినెస్ మరేదో కాదు.. కూల్ కేక్ తయారీ బిజినెస్. ఇటీవల అకేషన్ ఏదైనా కానీ కేక్ కట్ చేయాల్సిందే. సో దీన్ని మీరు బిజినెస్‌గా స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా మంచి ప్రాఫిట్ సాధించవచ్చు. మరి ఆ కేక్ తయారీ ఎక్కడ నేర్చుకోవాలి.? అని ఆలోచించవద్దు. మీరు దానికోసం బేకరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు.
మీ ఇంటి దగ్గరే కూర్చుని కూల్ కేక్ తయారీని యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవచ్చు.పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రణయ్ అనే వ్యక్తి ఈ బిజినెస్‌నే చిన్నగా మొదలుపెట్టి.. ఇక ఇప్పుడు మంచి సంపాదనను అర్జిస్తున్నాడు. తన కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో.. పై చదువులు చదవలేకపోయిన ప్రణయ్.. ఓ యూట్యూబ్ వీడియో ద్వారా కూల్ కేక్ తయారీని బాగా నేర్చుకున్నాడు. ఇక కొద్దిరోజులు నేర్చుకున్న తర్వాత.. ఆ కేక్ తయారీలో మంచి పట్టు సాధించి.. ఇంటి దగ్గర నుంచే తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు.కూల్ కేక్‌తో పాటు అందులో వాడే ఫ్లేవర్లను సైతం ప్రణయ్ సొంతంగానే తయారు చేసి మార్కెట్లో అమ్మేవాడు.సోషల్ మీడియాని ఉపయోగించుకొని తన బిజినెస్‌ను అంచలంచలుగా అభివృద్ధి చేశాడు. మొదటిగా అతను రూ. 4 వేలతో ఈ బిజినెస్ మొదలుపెట్టాడు.. ఇప్పుడు అన్ని ఖర్చులూ పోనూ నెలకు ఏకంగా రూ. 30 వేలకుపైగానే రాబడి ఆర్జిస్తున్నాడు.ఇక లేట్ ఎందుకు మీరూ ఓసారి ఈ బిజినెస్ ఐడియాను ట్రై చేసి చూడండి.