షాపులో వస్తువు కొంటే.. రెండు కేజీల టమాటా ఫ్రీ.. ఎక్కడంటే?
ఇలా కొండెక్కిన టమాటా రేట్ లపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు పేలుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ విషయం కేవలం జోక్స్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఎంతోమంది వ్యాపారులు ఇక తమ బిజినెస్ లు పెంచుకునేందుకు టమాటాని వాడుకుంటున్నాడు. ఇటీవల పంజాబ్ లోని గురుదాస్పూర్ లో కూడా ఒక ఫుట్వేర్ దుకాణం యజమాని ఇలాగే వినూత్నంగా ఆలోచన చేశాడు. టమాటాలను ఉచితంగా ఇస్తాము అంటూ ఒక అదిరిపోయే ఆఫర్ ప్రకటించి కస్టమర్లు తన షాప్ కి బారులు తీరేలా చేశాడు. తన షాప్ లో వెయ్యి నుంచి 1500 వరకు షూలు కొనుగోలు చేసిన వారికి రెండు కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు సదరు వ్యాపారి.
అయితే ప్రస్తుతం టమాటా రేట్లు అమాంతం పెరిగిపోయి.. సామాన్యులు కొనలేని పరిస్థితి ఉన్నందున.. ఈ ఆఫర్ తీసుకువచ్చినట్లు చెబుతున్నాడు యజమాని శ్యామలాల్. అయితే తమ దుకాణంలో బూట్లు చెప్పులు కొనుగోలు చేసే కస్టమర్లకు నిజంగానే టమాటలు ఇస్తున్నామని చెబుతున్నాడు. అయితే ఎంతోమందికి కస్టమర్లు ఈ ఆఫర్ కి ఆకర్షితులై ఆ షాప్ కు తరలి వెళ్తున్నారు. బూట్లతో పాటు ఉచిత టమాటాలు వస్తుండడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు యూపీలోని భాగపత్పూర్ లో కూడా ఒక మొబైల్ షాప్ యజమాని మొబైల్ కొంటే ఒక కేజీ టమాటా ఫ్రీ అంటూ ప్రకటించాడు.