ఐటీ రిటర్న్‌: డెడ్ లైన్ దాటితే కలిగే నష్టాలు?

Purushottham Vinay
ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, ఐటీఆర్‌ ఫైలింగ్ అనేది దేశంలోని ప్రతి బాధ్యతగల పౌరుని పని. ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు జులై 31 వ తేదీ చివరి తేదీ.ఈ సంవత్సరం డెడ్‌లైన్‌ను పొడిగించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నప్పటికి ఆ ఉద్దేశం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకా ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను దాఖలును కచ్చితంగా చేయాల్సిందే. అయితే గడువు పెంచుతారో తెలియదు గానీ, ఐటీఆర్‌ లను దాఖలు చేయకపోతే మాత్రం భారీ జరిమానా పైగా ఒక్కో సందర్భంలో జైలు శిక్షపడే అవకాశాలు మాత్రం ఉన్నాయి.అందుకే ఈ ఐటీ వర్గాలు హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషం దాకా వెయిట్‌ చేయకుండా గడువు లోపు ఐటీ రిటర్న్స్‌ను ఫైల్‌ చేయడం మంచిది.అలా కాని పక్షంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.



జులై 31వ తేదీతో ఐటీఆర్‌లను ఫైల్‌ చేయలేకపోయినవారికి ఒక చిన్న వెసులు బాటు అనేది ఉంది. సాధారణంగా జరిమానాతో దాఖలు చేసేందుకు కొంత గడువు అనేది ఉంటుంది. పన్ను చెల్లించాల్సిన పని ఉన్నట్లయితే, పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేసే దాకా గడువు తేదీ ముగిసిన తర్వాత నెలకు 1 శాతం వడ్డీని వసూలు చేస్తారు. ఇక ఐటీచట్టం 1961లోని 243ఎఫ్ ప్రకారం...ఐటీఆర్‌ను దాఖలు చేస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయం మొత్తం రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఈ జరిమానా రూ.5 వేలు ఉంటుంది. అలాగే వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉండి ఉంటే రూ.1000 జరిమానా విధిస్తుంది.ఇక సెక్షన్ 139(8A) ప్రకారం అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఫైనాన్స్ యాక్ట్, 2022, అసెస్సీ ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఎక్కువ వ్యవధిని అనుమతించడానికి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది.అయితే, సంబంధిత అసెస్‌మెంట్ అనేది సంవత్సరం ముగిసిన 24 నెలలలోపు (కొన్ని షరతులకు లోబడి) అప్‌డేట్ చేయబడిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఇక ఆలస్యమైన రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ ఆఫ్ ఆదాయాన్ని దాఖలు చేయడానికి పేర్కొన్న కాల పరిమితుల గడువు ముగిసిన తర్వాత కూడా దీనిని మనం ఫైల్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ITR

సంబంధిత వార్తలు: