ఏం ఐడియా గురూ.. వాడిపోయిన పూలతో కోట్లు సంపాదిస్తున్నారు?

praveen
ఇంతవరకు మీరు వాడి పడేసే వస్తువులు.. అనగా కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, పాత ఇరెన్, చిత్తు కాగితాలు, వాటర్ పాకెట్స్, డైపర్స్, న్యాపకీన్స్ గురించి వినే వుంటారు. ఆయా వస్తువులను మరలా వాడే క్రమంలో ఎంతోమంది వ్యాపారులు లక్షల్లో అర్జీస్తున్నారని. ఇపుడు తాజాగా పూజకు పూలు గురించి ఓ వార్త తెరపైకి వచ్చింది. అవును, అనేక రకాల వృథాల వస్తువులను తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు. వ్యర్థాలకు కొత్త అర్థం చెబుతున్నారు నేటి జనాలు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను దారాలుగా మార్చి జీన్స్‌ ప్యాంట్లు తయారు చేస్తున్నారు. కొబ్బరి బోండాలతో పీజు తాళ్లు, మండే పదార్థాలు తయారు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే దేవుడికి పూజించిన పూలతో సుగంధ భరితమైన అగర్‌బత్తులను తయారు చేస్తుండడం విశేషం. హిందూ దేశమైన భారత్‌లో నిత్యం అనేక దేవాలయాల్లో టన్నుల కొద్దీ పూలను పూజకు వాడుతున్నారనే విషయం విదితమే. ఇక మరుసటి రోజు ఆ పూలను బయట పడేయడమో లేక అన్నీ కలిపి ఒకేసారి నీటిలో కలపడమో జరుగుతోంది. ఇలా వృథా అవుతున్న పూలను తిరిగి వినియోగంలోకి తేవాలని ఆలోచించారు ఇద్దరు స్నేహితులు అయినటువంటి అంకిత్‌ అగర్వాల్, ప్రతీక్‌ కుమార్‌. అలా వారి ఆలోచన నుంచి పుట్టిందే పూలతో ప్రీమియం అగర్‌బత్తుల తయారీ.

ఈ నేపధ్యంలోనే 2017లోనే అంకిత్‌ అగర్వాల్, ప్రతీక్‌ కుమార్‌ ఫూల్‌ పేరుతో ఓ స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించారు. అనుకున్నదే తడవుగా దేశంలోని దేవాలయాల్లో అలంకరణ, పూజకు ఉపయోగించిన పూలను సేకరించి వాడిన పూలతో అగర్‌బత్తీల తయారీ ప్రారంభించారు. ఆలయాల నుంచి నిత్యం టన్నుల కొద్దీ పూలను సేకరించి వాటిలోని సుగంధ భరితమైన పూలను వేరు చేస్తున్నారు. వాటిని నీడలో ఆరబెట్టి.. తర్వాత పౌడ్‌గా చేస్తున్నారు. వీటికి మరికొన్ని సుగంధాలను జోడించి సువాసన భరితమైన అగర్‌బత్తీ పేస్ట్‌ తయారు చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో అనేక బ్రాండెడ్‌ అగర్‌బత్తీ కంపెనీలు వున్నప్పటికీ ఆయా కంపెనీలకు ఈ ఇద్దరు మిత్రులు గట్టి పోటీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: