RBI: ఆ బ్యాంకులపై సీరియస్?

Purushottham Vinay
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత కొన్ని రోజులుగా నియమాలను అతిక్రమిస్తున్న బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇంకా భారీ జరిమానా విధించడం వంటివి చేస్తోంది.తాజాగా మరో నాలుగు బ్యాంకులకు  జరిమానా విధించింది.ఆర్‌బీఐ ఫైన్ వేసిన బ్యాంకుల జాబితాలో గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ ఇంకా మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ & ది సెవలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి.అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 'గుజరాత్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్' డిపాజిట్ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి మాత్రమే కాకుండా.. క్యాష్ రిజర్వ్ రేషియో మెయింటెనెన్స్‌కు సంబంధించి రూల్స్ పాటించనందుకు ఆర్‌బీఐ ఏకంగా రూ. 4.50 లక్షలు ఫైన్ వేసింది.అలాగే గుజరాత్‌లోని బాబ్రా కేంద్రంగా పని చేస్తున్న నాగరిక్ సహకారి బ్యాంకుకు కూడా మొత్తం రూ. 2 లక్షలు జరిమానా విధించింది.



బ్యాంకింగ్ రెగ్యులేటరీ యాక్ట్ - 1949లోని కొన్ని ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లగించిన కారణంగా ఈ ఫైన్ వేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఇంకా ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడం, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు పంపాల్సిన నగదును పంపకపోవడం వల్ల మకరపురా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు రూ. 2 లక్షలు జరిమానాని విధించింది.అలాగే ది సెవాలియా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు ఆర్‌బీఐ రూ.50,000 జరిమానా విధించింది.ఇక bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటించకపోవడమే ఫైన్ వేయడానికి ప్రధాన కారణమని RBI స్పష్టం చేసింది.ఇక ఇప్పటికే చాలా కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్‌బీఐ మార్గదర్శలని పట్టించుకోట్లేదు. ఈ కారణంగానే RBI లైసెన్స్ రద్దు చేయడం లేదా భారీ జరిమానాలు విధిస్తోంది. కాబట్టి ఒక వ్యక్తి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసే ముందు లేదా డబ్బు డిపాజిట్ చేసేముందు ఖచ్చితంగా ఆ బ్యాంకు ఆర్ధిక స్థితిగతులను తప్పకుండా పరిశీలించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: