తెలివి ఉండాలే కానీ తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి ఎన్నో బిజిసెస్ ఐడియాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో బ్రెడ్ తయారీ కూడా ఒకటి. బ్రెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఇంతకీ ఈ బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని ఎలా మొదలు పెట్టాలి.? దీనికి ఎంత పెట్టుబడి అవసరపడుతుంది.? ఎంత ఆదాయం పొందొచ్చు.? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం బ్రెడ్ తినే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతీ రోజూ టిఫిన్‌లో చాలా మంది బ్రెడ్ తీసుకుంటున్నారు.ఇంకా అలాగే టోస్ట్‌లు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా బ్రెడ్ తయారీని ప్రారంభించి ఖచ్చితంగా మంచి ఆదాయం పొందొచ్చు.మీరు బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించాలనుకుంటే కనీసం రూ. 5 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర యోజన పథకం ద్వారా కూడా మీరు ఆర్థిక సాయాన్ని పొందొచ్చు. రూ. 5 లక్షల ప్రాథమిక పెట్టుబడితే బ్రెడ్ తయారీని మీరు ప్రారంభించొచ్చు. అయితే బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీకి 500 నుంచి 800 చదరపు అడుగుల స్థలం అవసరపడుతుంది.బ్రెడ్ తయారీకి అవసరమయ్యే యంత్రాలు మీరు ఆన్లైన్లో కూడా పొందొచ్చు. బ్రెడ్ తయారీకి పిండి, గ్లూటెన్, బ్రెడ్ ఇంప్రూవర్, కాల్షియం పౌడర్, డ్రై ఈస్ట్, ఉప్పు, చక్కెర, నూనె ఇంకా ప్యాకింగ్ కోసం మెటీరియల్ కావాలి. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంకా అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, జీఎస్టీ నెంబర్‌తో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎన్ఓసీ సర్టిఫికేట్ కూడా పొంది ఉండాలి. ఇక సొంత బ్రాండ్‌తో అమ్మాలనుకుంటే దీనికి ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.ఇక ఈ బ్రెడ్ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం విషయానికొస్తే.. సాధారణంగా బ్రెడ్ ప్యాకెట్ ధర రూ. 30 నుంచి రూ. 60 దాకా ఉంది. అయితే బ్రెడ్ తయారీకి అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.అలాగే మీరు తయారు చేసిన బ్రెడ్ ప్యాకేట్స్ను స్వంతంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రారంభ స్థాయిలోనే ఈజీగా రూ. 50,000 వేల ఆదాయం పొందొచ్చు. క్రమేణ ఈ ఆదాయం రూ. లక్ష దాకా పెరుగుతుంది. స్థానికంగా ఉండే దుకాణాలు, సూపర్ మార్కెట్స్‌లో ఒప్పందం చేసుకుంటే ఈ ఆదాయం మరింత పెంచుకోవచ్చు.