పండుగల వల్ల దేశ, విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం ఉండే వారు స్వదేశానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఇండిగో కంపెనీ సూపర్ ఆఫర్లను ప్రకటించింది. దసరా సేల్ పేరుతో టికెట్ ధరలపై ఏకంగా 25శాతం తగ్గింపును అందిస్తోంది. నిజానికి ఈ ఏడాది అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 23 దాకా బుకింగ్ లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దీనిని డిసెంబర్ 31 వ తేదీ వరకూ పొడిగించినట్లు ఇండిగో కంపెనీ ప్రకటించింది.అయితే ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి ముందు వారి గమ్యస్థానాలకు మూడు రోజుల ముందుగానే తమ విమానాలను బుక్ చేసుకోవాలి. ఇక ఇండిగో కోడ్‌షేర్ కనెక్షన్‌లకు ఇది వర్తించదు . 2023 చివర్లో ప్రయాణించాలనుకునే వారికి సాదర స్వాగతం పలికేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ పథకాన్ని ప్రారంభించింది. గత కొన్ని నెలల్లో, ఇండిగో కంపెనీ కొత్త గమ్యస్థానాలను కలుపుతూ ప్రపంచవ్యాప్తంగా దాని మార్గాలను విస్తరించింది. ఆ కంపెనీ నెట్‌వర్క్‌లోని కొన్ని మార్గాలను తిరిగి ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంటూ, వినియోగదారులకు అద్భుతమైన ప్రయాణ సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని ఇండిగో ఎయిర్‌లైన్ కంపెనీ తెలిపింది.
ఇంకా అంతేగాక ఇండిగో తన 18వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయణికులకు మరపురాని క్షణాలను సృష్టించడానికి, వారితో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని కంపెనీ వివరించింది. మరింత సమాచారం ఇంకా పూర్తి వివరాల కోసం, ప్రయాణికులు ఇండిగో వెబ్‌సైట్‌ని సందర్శించాలని లేదా ఇండిగో మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని కంపెనీ సూచించింది.ఇదిలా ఉండగా ఇండిగో హైదరాబాద్‌ను సింగపూర్, కొలంబోలను కలుపుతూ రెండు కొత్త విమానాలను ప్రారంభించింది. సింగపూర్‌కు వెళ్లే విమానం గత శుక్రవారం నాడు తెల్లవారుజామున 2:50 గంటలకు ప్రారంభమైంది.అది ఉదయం 10 గంటలకు సింగపూర్ చేరుకుంటుంది. ఇంకా అదే విధంగా, తిరుగు ప్రయాణంలో సింగపూర్ కాలమానం ప్రకారం రాత్రి 11:25 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 1:30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటుంది.