అయోధ్య టూరిస్టులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలోనే?

Purushottham Vinay
శ్రీ రాముని భక్తులకు ఐఆర్‌సీటీసీ టూరిజం అదిరిపోయే సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులకు అయోధ్యకు వెళ్లి బాల రాముడిని దర్శించుకునేందుకు మంచి అవకాశం దొరికింది. బాల రాముడితో పాటు ఇతర దేవాలయాలు కూడా చాలా తక్కువ ధరలోనే దర్శించుకునే సదావకాశాన్ని  కేంద్రం ఇస్తోంది.అయోధ్య నగరానికి స్పెషల్‌గా టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. సామాన్య భక్తులకు చాలా తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇక ఇందులో భాగంగానే గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు.. అయోధ్యలోని రామాలయం నుంచి ప్రారంభమై.. ప్రయోగ్‌ రాజ్‌తో పాటు మరో మూడు జ్యోతిర్లింగాలకు కూడా ఈ రైలు ప్రయాణం చేయనుంది.అలాగే ఇందులో మరికొన్ని ప్రదేశాలు కూడా యాడ్ కానున్నాయి. మరి ఈ టూర్ ఎప్పుడు మొదలు అవ్వనుంది? ఇంకా ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? అనే వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


ఈ టూర్ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీలో చాలా ప్రదేశాలు కూడా కవర్ కానున్నాయి. అవేంటంటే.. ప్రయాగ్ రాజ్, అయోధ్య, వారణాసి, చిత్ర కూట్, నాసిక్ ఇంకా ఉజ్జయిని వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కూడా పొందుతారు. ఇంకా అదే విధంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నుండి సురేంద్ర నగర్, విరామ్‌గామ్, ఛాయా పురి, నదియాడ్, గోద్రా ఇంకా రత్లాం వంటి ప్రయాణికులు బోర్డింగ్ సౌకర్యం పొందనున్నారు.ఇక ఈ ప్యాకేజీ 10 పగళ్లు, 9 రాత్రులు ఉంటుంది.ఈ భారత్ గౌరవ్ ప్రయాణం రైలులో ఉంటుంది. ఎకానమీ ఏసీ, 3 ఏసీ, 2 ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ఛాన్స్ ఉంటుంది.ఇంకా అదే విధంగా ప్రయాణికులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం కూడా భక్తులకు ఉంటుంది. ఇంకా అంతే కాకుండా దేవాలయాలకు వెళ్లేటప్పుడు భక్తులకు బస్సు సౌకర్యం కూడా కల్పించబడుతుంది.అలాగే ఈ టూర్ ప్యాకేజీలో ధరలు కోచ్‌ల ప్రకారం వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.46 వేలు, కంఫర్ట్ క్లాస్ కోచ్‌లోప్రయాణించేందుకు రూ.33 వేలు ఇంకా ఎకానమీ క్లాస్ టికెట్ కొనుగోలుకు రూ.20,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా అయోధ్యతో పాటు దేవాలయాలను అతి తక్కువ ధరలోనే దర్శించే అవకాశం భక్తులకు ఐఆర్‌సీటీసీ అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: